రాఘవ చేయుత మరో ప్రాణానికి అయుష్షునిచ్చింది.. Raghava Lawrence's timely generousness saves another child

Raghava lawrence s timely generousness saves another child

raghava lawernce, raghava lawernce philanthropic activities, raghava lawernce medical support, raghava lawernce charitable trust, raghava lawernce orphange, raghava lawernce human gesture, raghava lawernce services, raghava lawernce abinesh, raghava lawernce heart surgeries, raghava lawernce actor, raghava lawernce choreographer, raghava lawernce director

Choreographer turned actor turned director Raghava Lawrence stands definitely for his human gestures and services, his timely help saves another child abinesh.

రాఘవ చేయుత మరో ప్రాణానికి అయుష్షునిచ్చింది..

Posted: 09/07/2016 10:21 AM IST
Raghava lawrence s timely generousness saves another child

భారత దేశంలో ఎంతో మంది ప్రముఖులు, సుసంపన్నులు, పారిశ్రామిక వేత్తలు, ధనవంతులు వున్నా.. వారిలో కొందరు మాత్రమే సమాజా వికాసానికి పాటుపడుతుంటారు. అందులో ప్రముఖంగా చెప్పుకోదగిన వారిలో ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒకరు. ఇప్పటికే తన ఆద్వర్యంలో అనాధ శరణాలయం, స్వచ్చంధ సంస్థతో పాటు వికాలాంగులకు చేయుత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆయన.. తాజాగా మరో బాల హృద్రోగికి అయష్షునిచ్చాడు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

పలువురికి గుండె శస్త్ర చికిత్సలకు ఆర్థికసాయం అందిస్తున్న లారెన్స్, తాజాగా అభినేష్ అనే మరో చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. చిన్నారి హృద్రోగాన్ని దూరం చేసి.. అతనికి అయష్ఫునిచచిన వైద్యులకు రాఘవ లారెన్స్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఆయన ఆర్థిక సాయంతో హృద్రోగాలకు దూరమైన చిన్నారుల సంఖ్య 130కి చేరిందని ఆయన స్వచ్చంధ సంస్థ వర్గాల సమాచారం.

తనకు బాల్యంలో అనేక వ్యాదుల బారిన పడ్డానని, అయితే అప్పుడు తనను ఎవరూ అదుకోలేదని, దీంతో తాను పేదరికంతో అలమటిస్తున్న చిన్నారులకు అరోగ్యాన్ని పరిరక్షించాలనే దృడ సంకల్పానికి వచ్చి సామాజిక సేవలకు పెద్దపీట వేస్తున్నానని లారెన్స్ తెలిపారు. ఇందులోభాగంగా పలువురిని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను స్వీకరించారు. లారెన్స్ తన కన్నతల్లిపైగల అపార ప్రేమకు చిహ్నంగా ఒక గుడిని కట్టిస్తున్నారు. త్వరలో ఆ గుడిలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏదీ ఏమైనా డబ్బున్నోళ్లు మారాజులు కాదు.. మంచి మనస్సునోళ్లు, చేయూతనందించే వాళ్లే మారాజులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghava lawernce  abinesh  heart surgery  human gesture  philanthropic activities  

Other Articles