టీడీపీలోకి మద్దుల శ్రీవివాస్ రెడ్డి | TRS leader maddula srinivas back to TDP

Trs leader maddula srinivas back to tdp

TRS Maddula Srinivas Reddy, Srinivas reddy back to TDP, Maddula Srinivasreddy TDP, TRS to TDP, TRS leaders, Maddula Srinivasreddy rally, Maddula Srinivasreddy TDP bhavan

Maddula Srinivasreddy back to TDP from TRS.

టీఆర్ఎస్ నుంచి టీడీపీ ఒక వికెట్ ఢమాల్

Posted: 09/07/2016 10:41 AM IST
Trs leader maddula srinivas back to tdp

తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయాక కూడా అధిష్టానం ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉందా అన్న ప్రశ్నలకు, అసంతృప్తి మూలంగానే వారంతా తిరిగి సొంత గూటికి చేరుతారన్న సమాధానాలు వినిపించాయి. అయితే ఒక్కసారి తిరిగి టీడీపీని విడిచివెళ్లాక వారు తిరిగొస్తారా అన్న అనుమానాలకు, ప్రస్తుత పరిణాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి టీడీపీకి అప్పుడే ఒక వికెట్ పడిపోయింది. కానీ, ఇక్కడ చేరింది ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదు. అయినా ఎందుకింత చర్చ అంటారా చెబుతాం.

రాష్ట్రం విడిపోయాక కొత్త రాష్ట్రం తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సేఫ్ సైడ్ రాజకీయాలతో చాలా మంది నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్న టీడీపీ... చివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పార్టీగా మిగిలిపోయింది. ఎమ్మెల్యేల మాట అటుంచి పార్టీకున్న ఏకైక ఎంపీ, మల్కాజిగిరి లోక్ సభ అభ్యర్థి మల్లారెడ్డి కూడా ఇటీవలే కారెక్కేశారు. ఆ సమయంలో  కుడిభుజంలా వ్యవహరించిన ఆయన బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి కూడా తన బావ వెంటే గులాబీ గూటికి చేరారు.

సాధారణంగా ఫిరాయింపులు చేసి పార్టీలోకి వచ్చే కీలక నేతలకు కీలక బాధ్యతలే అప్పజెప్పటం షరా మాములే. కానీ, టీఆర్ఎస్ లో ఆ పరిస్థితులు లేవు. కనీసం వారికి కలిసేందుకు కూడా అధిష్టానం ఇష్టత చూపటం లేదు. దీంతో చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. వీరిలో మద్దుల కూడా ఉన్నారు. మాజీ సర్పంచ్ అయినప్పటికీ జనాల్లో మద్దులకు ఉన్న పరపతి అంతా ఇంతా కాదు. మల్లారెడ్డి విజయంలో కీలకపాత్ర పోషించింది మొత్తం ఈయనే. అయితే పార్టీ మారాక మల్లారెడ్డి టీఆర్ఎస్ నేతలతో బాగానే కలిసిపోయినా... మద్దుల మాత్రం అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. చివరికి టీఆర్ఎస్ లో ఇక ఇమడలేనని తేల్చుకున్న మద్దుల, మళ్లీ తన సొంత గూడు టీడీపీ వైపు చూశారు.

పెద్దలు టీ టీడీపీ చీఫ్ ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో మంతనాలు సాగించారు. మద్దుల రీఎంట్రీకి ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన తన సొంత గూడుకు చేరుతున్నారు. బుధవారం మేడ్చల్ నుంచి భారీ అనుచర గణంతో బయలుదేరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రమణ, రేవంత్ రెడ్డిల సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మద్దుల వెంట ఆయన సొంతూరుకు చెందిన వారే కాకుండా, శామీర్ పేట, కీసర, ఘట్ కేసర్ లకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి చేరుతున్నారు. టీఆర్ఎస్ లో చేరిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలియజేసేందుకు ఈ భారీ ర్యాలీకి ఫ్లాన్ వేసినట్లు అర్థమౌతోంది. చూస్తుంటే మున్ముముందు చిన్న చేపల బాటలోనే పెద్ద నేతలు కూడా పయనించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maddula Srinivasreddy  TRS  TDP  Rally  

Other Articles