ప్రత్యేక హోదా డిమాండ్ తో రాష్ట్ర బంద్ కు వైసీపీ పిలువు.. YSRC party gives state bandh call demanding special status to AP

Ysrc party gives state bandh call demanding special status to ap

Andhra pradesh, Andhra pradesh special status, Andhra pradesh special package, chandrababu, Andhra pradesh Bandh, YS Jagan, chandra babu, TDP, YSRCP, special status, arun jaitley, PM modi, Venkaiah naidu, ys jaganmohan reddy, jana sena, pawan kalyan, opposition parties, congress, chandrababu news. india news

Leader of the opposition party of Andhra Pradesh state gives bandh call on 9th september in regard of special status

ప్రత్యేక హోదా డిమాండ్ తో రాష్ట్ర బంద్ కు వైసీపీ పిలువు..

Posted: 09/08/2016 12:48 PM IST
Ysrc party gives state bandh call demanding special status to ap

నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు కేంద్రం మంగళం పాడిన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 9న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నామని ఏపీ విపక్ష పార్టీ వైఎస్సార్ సిపీ అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అర్థరాత్రి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం దారుణమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య అర్థరాత్రి వరకు సాగిన హైడ్రామా అంతా చంద్రబాబు దర్శకత్వంలోనే సాగిందని ఆయన విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఏవిధంగా అన్యాయం చేశారో అదేవిధంగా ఇప్పుడు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తెలిపారన్నారు. జైట్లీ, చంద్రబాబు కలిసి ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు వస్తాయని, ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని జగన్ వివరించారు. ప్రత్యేక హోదా వస్తేనే వేలకొద్ది పరిశ్రమలు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ యువత ఆశలపై జైట్లీ నీళ్లు చల్లారని అన్నారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించడాన్ని జగన్ తప్పుబట్టారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్ తో ఆట లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా శనివారం ఏపీ బంద్ చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ కు సంబంధించి వామపక్ష నాయకులతో మాట్లాడామని వెల్లడించారు. చంద్రబాబు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra pradesh Bandh  YS Jagan  chandra babu  TDP  YSRCP  special status  arun jaitley  PM modi  Venkaiah naidu  

Other Articles