పవన్ పోరుపై నారాయణ సెటైర్లు | CPI narayana funny comments on pawan kalyan status fight

Cpi narayana funny comments on pawan kalyan status fight

CPI narayana funny comments on pawan, Pawan Kalyan CPI narayana, CPI Narayana Pawan Kalyan Kakinada Meeting, Pawan about CPI Narayana,

CPI narayana funny comments on pawan kalyan about AP status fight.

పవన్ సిన్సియారిటీపై కామ్రేడ్ కామెంట్

Posted: 09/08/2016 04:15 PM IST
Cpi narayana funny comments on pawan kalyan status fight

ఓవైపు ప్రత్యేక ప్యాకేజీపై కసరస్తుతులు చేస్తున్న సమయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం హోదా కోసం పోరాడేందుకు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంపై కత్తులు దూసేందుకు సిద్ధమైపోతున్నాడు. ఈ క్రమంలోనే కాకినాడ సభ ద్వారా బీజేపీ అధిష్టానానికి గట్టి వార్నింగ్ ఇస్తాడని అంతా భావిస్తున్న తరుణంలో వ్యంగాస్త్రాలకు ఫేమస్ అయిన సీపీఐ జాతీయ కార్యదర్శి పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్  గుడ్డోడు గూట్లో రాయేసినట్టు మాట్లాడుతున్నాడే తప్ప, హోదా సాధించాలన్న అంకితభావంతో అతనిలో మచ్చుకైనా కనిపించడం లేదంటూ నారాయణ నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ సభ హోదా అంశాన్ని పక్కదారి పట్టించేదిగా ఉందే తప్ప ఎందుకూ పనికిరాదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఢిల్లీలో వెంకయ్యనాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామాలను నడిపించారని, దీనికి పవన్ పక్క నుంచి సపోర్ట్ ఇస్తున్నాడని ఆయన విమర్శించారు. తక్షణం టీడీపీ, పవన్ కళ్యాణ్ లు రోడ్డు మీదకు వచ్చి అన్ని పక్షాలతో చేయి కలిపి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు.

నారాయణకు పవన్ ను విమర్శించడం కొత్త అంశం ఏం కాదు. గతంలో ప్రజా రాజ్యంలో ఉన్నప్పటి నుంచే పవన్ పై నారాయణ విమర్శలు సంధించడం పరిపాటుగా మారింది. ‘చేతనైతే రాజకీయాల్లోకి రా.. లేదంటే రజనీకాంత్‌లా ఇంట్లో ఉండు’ అంటూ ఆ మధ్య పవన్ కు ఉచిత సలహా కూడా ఇచ్చారు. అంతేకాదు పవన్ వైఖరి పొంగే పాలల్లో ఉప్పు వేసే రకంగా కనిపిస్తోందని, అభిమానులను స్వార్థం కోసం వాడుకుంటున్నాడని ఆరోపించాడు కూడా. అఫ్ కోర్స్ తిరపతి సభలో అందుకు తగ్గట్లుగానే జనసేనాధిపతి కౌంటర్ సమాధానం ఇచ్చాడనుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  CPI  Narayana  AP  special status  

Other Articles