దేశ సంపన్నుల జాబితాలోకి అచార్య బాలకృష్ణ Acharya Balakrishna joins India's richest club

Acharya balakrishna joins india s richest club

Patanjali Ayurved, Acharya Balakrishna, FMCG sector, Dabur, Colgate Palmolive, Hurun India Rich List, Ramdev, yoga guru baba ramdev, Dabur’s Anand Burman, Hurun India Rich List

Patanjali CEO Acharya Balakrishna has joined the club of India’s richest, with wealth amounting to Rs 25,600 crore.

దేశ సంపన్నుల జాబితాలోకి అచార్య బాలకృష్ణ

Posted: 09/13/2016 09:11 PM IST
Acharya balakrishna joins india s richest club

భారతదేశం సుసంపన్నమైంది కానీ దేశస్థులే పేదలు అన్న కోటేషన్లు విన్నప్పుడల్లా సగటు భారతీయుడికి నలకుబేరులు. నల్లదనం గుర్తుకువస్తుంది. ఏళ్లు గడుస్తున్నా సంపన్నులు సుసంపన్నులు అవుతుండగా, పేదలు కడు పేదలుగా మారడమే ఇందుకు కారణం. అయితే సంపన్నుల జాబితాలో మాత్రం తాజాగా మరో అచార్యలు వారు వచ్చి చేరారు, అనతికాలంలోనే తన పోటీదారులను తోసిరాజుతూ.. ముందుకు దూసుకువచ్చారు. ఎంతలా అంటే.. ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న వారిని కూడా వెనక్కు నెట్ి అమాంతంగా ముందుకు దూసుకెళ్లడం కాసింత చర్చనీయాంశమే.

అయితే ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు.? ఆయన అంతలా ఎలా సంపాదించారు,? ఆయన చేస్తున్న వ్యాపారమేంటి అన్న ప్రశ్నలు కురిపిస్తున్నారు కదూ..? యోగా గురు బాబా రాందేవ్ వద్ద శిష్యరికం చేసిన నమ్మిన బంటుగా వుంటూ.. ఆ మధ్య ఆయన కోసం జైలుకు కూడా వెళ్లివచ్చిన వ్యక్తే అయన పేరు అచార్య బాలకృష్ణ.. బాబా రాందేవ్ పతాంజలి అయుర్వేద ఉత్పత్తులతో పాటు పలు ఎఫ్ఎంజీసీ ఉత్పత్తులను కూడా తయారు చేస్తూ వాటిని మార్కెట్లోకి విడుదల చేశారు.

ఈ సంస్థకు అచార్య బాలకృష్ణ సీఈఓగా వ్యవహరిస్తున్నారు, ఆయన ఏకంగా నికర అస్తులను సంపాదించి ఎఫ్ఎంజీసీ రంగంలోని సంపన్నుల సరసన చేరాడు. బాలకృష్ణ మొత్తంగా 25వేల 600 కోట్ల రూపాయల అస్తులను సంపాదించి ఈ స్థానాన్ని పోందారు. హురన్ ఇండియా సంస్థ రూపోందిచిన ఈ జాబితాలో డాబర్ ఇండియా లిమిటెడ్ అనంద్ బర్మన్ అగ్రస్థానంలో నిలిచాడు, తన పోటీదారులను మార్కెట్ లోనే కాకుండా అస్తుల సంపాదనలో కూడా వెనక్కునెట్టి ముందుకు సాగుతున్నారు బాలకృష్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles