ముదురుతున్న యాదవ కుటుంబ కలహం | UP CM Akhilesh Yadav is facing the father of all battles

Up cm akhilesh yadav is facing the father of all battles

UP CM Akhilesh Yadav, Mulayam Family clashes, UP govt resolve soon, Akhilesh versus Mulayam, Mulayam fight with son

UP CM Akhilesh Yadav is facing the father of all battles.

యాదవ్ వర్సెస్ యాదవ్ ఎటు పోతుందో?

Posted: 09/14/2016 05:26 PM IST
Up cm akhilesh yadav is facing the father of all battles

ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. కుటుంబ కలహాలు పెడుతున్న వేళ దానిని కవర్ చేసేందుకు అసలు మీకు అది ఎక్కడ కనిపించిందని సీఎం అఖిలేష్ తిరిగి ప్రశ్నలు వేస్తున్నాడు.

‘మా కుటుంబంలో పోరు ఎక్కడ కనిపించింది మీకు? ఇది ప్రభుత్వంలో పోరాటం, కుటుంబ పోరు కాదు’’ అని సమాజ్ వాదీ పార్టీ నేత, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ‘‘మా కుటుంబానికి చెందని వ్యక్తి సమస్యలను సృష్టిస్తూండవచ్చు’’ అన్నారు. ఆయన మాటల అంతరార్థాన్ని కొందరు వివరిస్తూ ఇటీవలే పార్టీలో తిరిగి చేరిన అమర్ సింగ్‌పైనే అఖిలేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. చిన్నాన శివ్ పాల్ తో వివాదం కేవలం రాజకీయపరమైందనేనని చెబుతున్నాడు. అంతేకాదు కీలక నిర్ణయాలు తీసుకున్న సమయంలో తాను ములాయం సింగ్ ను సంప్రదించానని కూడా చెప్పాడు. అయితే ఆ నిర్ణయాలు ఏంటన్నది మాత్రం వివరించలేదు.

ఇక తన అన్నను కలిసిన శివపాల్ సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ములాయంను వ్యతిరేకించే ధైర్యం ఎవరికీ లేదని, తన అన్న ఏది చెబితే అది చేస్తానని అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీకి వెళ్లి అన్న ములాయంతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన వెంట రాంగోపాల్ యాదవ్ ను సైతం తీసుకెళ్లారు. అనంతరం మాట్లాడుతూ, పార్టీ పరిస్థితిని ఆయనకు వివరించానని, ములాయంపై తనకెంతో విశ్వాసం ఉందని తెలిపారు. పోర్టు ఫోలియోలు ఇవ్వడం, తొలగించడం ముఖ్యమంత్రిగా అఖిలేష్ ఇష్టమని తెలిపిన ఆయన, ప్రభుత్వానికి సంబంధించి ఆయన నిర్ణయాలు కీలకమని, పార్టీకి సంబంధించి ములాయం మాటే వేదవాక్కని అన్నారు.

కాగా, అఖిలేష్ క్యాబినెట్ రద్దు కానుందని, ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న వార్తలు వస్తున్న వేళ, ఢిల్లీకి బయలుదేరిన అఖిలేష్, ఈ సాయంత్రం తన తండ్రితో భేటీ కావటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  CM Akhilesh Yadav  SP chief Mulayam Sigh  

Other Articles