నెమ్మదిగా ప్రత్యేక హోదా పోరాట అంశం నెమ్మదిగా నిదానిస్తున్న వేళ తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని హీరో శివాజీ ఘంటా పథంగా చెబుతున్నాడు. అయితే ఈ పోరాటంతో ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడిగా తాను చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెగ ఫీలయిపోతున్నాడు. కొందరైతే తనను శివాజీగాడు ఎవడు? వాడిది ఏ కులం? అని ప్రశ్నిస్తున్నారని వాపోతున్నాడు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాబ్ రావాలంటే హోదా కావాలి అంటూ ఓ ప్రెస్ మీట్ శివాజీ చాలా విషయాలనే చెప్పుకోచ్చాడు. కులాలు మనం క్రియేట్ చేసుకున్నామని, దానిపై రాద్ధాతం చేస్తున్నారేంటని దుయ్యబట్టారు.
హోదా కోసం పోరాడుతుంటూ మధ్యలో ఈ కులమెందుకు వచ్చింది? , సమాజం హితం కోసం పోరాడుతుంటే రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ప్రత్యేక హోదాతో లాభం లేదంటూ, ప్రత్యేక సాయం అంటూ ఇటువంటి మాటలు ఎన్నిరోజులు చెబుతారని, హోదా వస్తే పరిశ్రమలు రావని వెంకయ్య అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు సాయం చేస్తున్న ప్రధాని మోదీకి ఏపీ కనిపించడంలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హోదా కోసం ప్రజలతో చర్చించాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు హోదాపై అడిగినప్పుడు ఎందుకు అసహనానికి గురవుతున్నారని ఆయన అన్నారు.
‘మిమ్మల్ని అగడవద్దా.. ఇదేమైనా కుటుంబానికి సంబంధించిన విషయమా?’.. అని శివాజీ అన్నారు. మళ్లీ ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా గురించే లెవనెత్తుతారు, ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఉన్న హోదా తీసేస్తున్నామని చెబుతున్నారు. కానీ, వాటి సమయం అయిపోయింది కాబట్టే కదా. అలాంటప్పుడు ఏపీని వాటికి ఎందుకు అంటగట్టడం అంటూ ప్రశ్నలు కురిపించాడు. ‘తప్పుడు ప్రచారాలతో మమ్మల్ని విమర్శిస్తున్నారు.
తెలుగు ఆత్మగౌరవం గురించి చలసాని శ్రీనివాస్ పోరాడుతున్నారు.. ఆయనను కూడా విమర్శిస్తారా... రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం నెలకొల్పుతున్నారు. పోలవరం అంటూ డ్రామాలాడుతున్నారు. పోలవరానికి చల్లబద్ధత కల్పించేటప్పుడు ఎన్నో లింకులు పెడతారు.. హోదా వల్ల రాష్ట్రానికి అదనంగా 60 వేల కోట్ల రూపాయల ప్రయోజనం ఉంది అది వదిలేసి శాంతియుతంగా పోరాటం చేస్తున్న మమల్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ శివాజీ ఆవేదన వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more