ప్రచారం టెక్నాలజీ డిజిటల్ పుంతలు తొక్కుతున్న వేళ కీలకమైన యూపీ ఎన్నికల ప్రచారంలో ‘వెరైటీ’ గా కుర్చీల బదులు మంచాలు వేస్తే బావుంటుందని భావించిన కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. సభ ఇలా అయిపోగానే, అలా మంచాలు మాయమైపోతుండటంతో చివరకు కాట్ పే చర్చ సీన్ అంతా పిచ్చ కామెడీగా మారిపోతుంది. తొలి సభలోనే 2 వేల మంచాలను ఎత్తుకెళ్లారు సభకు వచ్చిన గ్రామస్థులు. ఆ తర్వాత మరో సభలో మనుషులను పెట్టి మరీ మంచాలు ఎవరూ ఎత్తుకు వెళ్లకుండా అడ్డుకోవాలని చూసి అభాసుపాలైంది
బుధవారం మీర్జాపూర్ లో నిర్వహించిన ‘ఖట్ సభ’లో రాహుల్ ప్రసంగం ఇలా ముగియగానే, మంచాల లిప్టింగ్ అలా జరిగిపోయింది. రాహుల్ ప్రసంగానికన్నా మంచాలు తీసుకు వెళ్లే ప్రజలకే మంచి పబ్లిసిటీ వస్తుండగా, దీన్నెలా ఆపాలో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్న సీన్ దర్శనమిచ్చింది. తన ప్రసంగంలో మోదీని విమర్శించేందుకే రాహుల్ అధిక సమయాన్ని తీసుకున్నారు. ఆయన ధరించి రూ. 15 లక్షల విలువైన సూట్ నుంచి మొదలు పెడితే, సెల్ఫీల పిచ్చి ఎక్కువని, ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని, విదేశాలకే పరిమితమవుతున్నారని విమర్శలు గుప్పించాడు. అయితే జనాలు మాత్రం అవేం పట్టనట్లు మంచాలనే అంటిపెట్టుకుని ఉండటం గమనించవచ్చు.
అయితే దీనిపై మీర్జాపూర్ వాసుల వాదన మరోలా ఉంది. రాహుల్ ప్రసంగం, సభ ముగిసిన తరువాత ఎవరు కూర్చున్న మంచాన్ని వారు ఎత్తుకుపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వారు హామీ ఇస్తేనే తాము వచ్చామని మీర్జాపూర్ వాసులు చెబుతున్నారు. "రాహుల్ సభకు వస్తే, ఉచిత మంచాన్ని ఇస్తామని ఓ కాంగ్రెస్ నేత మాకు చెప్పారు. ఆ పార్టీ ఇప్పటివరకూ మాకేమీ ఇవ్వలేదు. ఇప్పటికి కనీసం ఈ మంచమైనా దక్కింది" అని మీర్జాపూర్ సభకు వచ్చి ఓ మంచం పట్టుకెళ్లిన కైలాష్ నాథ్ వ్యాఖ్యానించాడు.
నిజానికి కాంగ్రెస్ కి ఈ ఐడియా ఇచ్చింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. సామాన్య ప్రజలకు చేరువయ్యే రీతిలో ఉంటుందని ఇలా రాహుల్ సభల్లో మంచాలు వాడాలని సూచించాడు. అయితే 2014 జాతీయ ఎన్నికల్లో ‘చాయ్ పే చర్చ’ పేరుతో నరేంద్ర మోదీని పాపులర్ చేసిన ఆయనగారు, మరి ఇప్పుడు మంచాలతో మాత్రం కాంగ్రెస్ ముంచేలా ఉన్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more