తొమ్మిది మంది ప్రముఖ నటులకు హైకోర్టు తాఖీదులు kollywood actors issued madras high court notices

Kollywood actors issued madras high court notices

nadigar sangam building, nadigar sangam, madras high court, vishal, kamal hassan, nasser, karthi, nadigar sangam election, varahi, tamil nadu film body, tamil film, tamil film industry, latest news

madras high court issues notices to kollywood popular actors and nine nadigar sangam office bearers in regard with nadigar sangam building construction.

ప్రముఖ నటులు తొమ్మిది మందికి హైకోర్టు తాఖీదులు

Posted: 09/15/2016 09:11 AM IST
Kollywood actors issued madras high court notices

టాలీవుడ్ కళాకారుల మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల సమయంలో వర్గాలుగా చీలిపోయిన నటినటులు.. ఆ తరువాత మాత్రం అంతా ఒక్కటై పరిశ్రమ అభ్యున్నతికి పాటుపడటం గత ఏడాది జరిగిన ఎన్నకలలో మనం చూశాం. కానీ కొలీవుడ్ లో మాత్రం అలా కాకుండా వర్గాలుగా వారు పునాదులు వేసుకోవడానికి నడిగర్ సంఘం ఎన్నికలు కీలకంగా మారుతున్నాయా..? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల విశాల్ పై నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్ సతీమణి రాధిక చేసిన ట్విట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లుంది. అయితే తాజాగా నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో నటుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వివరాల్లోకెళ్లితే చెన్నై, తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్‌సంఘం సభ్యుడు చెన్నై నగర హక్కుల విభాగంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నడిగర్ సంఘం 62వ సర్వసభ్య సమావేశంలో సంఘ భవనాన్ని నిర్మించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారన్నారు. అదే విధంగా సంఘ సభ్యులతో చర్చించకుండానే బెంగళూర్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థతో సంఘ భవన నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
 
అందువల్ల ఆ ఒప్పందాన్ని రద్దు చేసి సంఘ సభ్యులందరితో చర్చించి నూతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. వారాహి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ , కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, సంఘ ట్రస్ట్ సభ్యులు కమలహాసన్, కుట్టిపద్మిని, ఎస్‌వీ.శేఖర్, పూచిమురుగన్ మొదలగు తొమ్మిది మందికి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను 19 తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nadigar sangam building  varahi  madras high court  vishal  kamal hassan  nasser  karthi  

Other Articles