గూండారాజ్యం అని ముద్దుగా పిలుచుకుంటున్న బీహార్ లో సినిమాలో చూపించినట్లు నడిరోడ్డుపైనే మనుషులను క్రూరంగా దాడి చేసి చంపడం లాంటి సీన్లు తరచూ కనిపిస్తుంటాయి. లీడర్లు కూడా క్రిమినల్స్ తో కుమ్మక్కు అయిపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అధికారంలో ఉన్న పార్టీ, పైగా మంత్రి పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో క్లోజ్ గా ఉంటే ప్రతిపక్షాలకు పండగే కదా!
సివాన్ ప్రాంతంలో 13 మే 2016లో జర్నలిస్టు రాజ్ దేవ్ రాజన్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ కైఫ్ అలియాస్ బంటీ తప్పించుకుని తిరుగుతున్నాడు. సీబీఐ ఈ కేసులో ముమ్మర దర్యాప్తు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ కరడుగట్టిన నేరస్తుడితో మంత్రులు, నేతల పక్కనే తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. నిన్న మాజీ ఎంపీ, భాగల్ పూర్ జైలు నుంచి విడుదలైన షహబుద్దీన్ పక్కనే శనివారం నాడు కనిపించిన బంటీ, ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు, రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్ వెంట కనిపించడంతో, ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
అయితే, తన వెంట బంటీ ఉన్నాడన్న ఆరోపణలను తేజ్ కొట్టి పారేయడం గమనార్హం. "ప్రచారంలో ఉన్న ఫోటోలు, వీడియోల విషయమై నేనేమీ చేయలేదు. నా చుట్టూ వందలు, వేల మంది తిరుగుతుంటారు. నన్ను కలుస్తుంటారు. ఆరోపణలన్నీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సృష్టే" అన్నాడు. అదే సమయంలో 'సెక్స్ రాకెట్ నడిపినట్లు ఆరోపణలు వచ్చిన ఓ వ్యక్తి, ప్రధాని మోదీతో కలిసున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఒకరిపై వేలు చూపించే ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాలి' అంటూ సెటైర్ కూడా వేశాడు.
ఏదేమైనా లాలూ అండ్ సన్స్ ఎప్పుడు దొరుకుతారా? ఎప్పుడు విమర్శలు గుప్పించేందుకు రెడీగా ఉన్న బీజేపీ తదితర విపక్షాలకు మరో అస్త్రం దొరికినట్లయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more