అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్కు మరోసారి పెద్ద దెబ్బ తగిలింది. శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య రెండుకి పడిపోయింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో 44 మంది ఉన్న కాంంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 42 మంది పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొన్నాళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంచలనాలకు నిలయంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు బీజేపీ కి షాక్ ఇస్తూ ఇచ్చిన తీర్పుతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ అధికారంలోకి వచ్చారు. మూడింట రెండు వంతుల మంది ఒకేసారి పార్టీ మారితే వాళ్లకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదన్న విషయం తెలిసిందే. అంతకు మించిన సభ్యులు ఒకేసారి కండువాలు మార్చుతుండడంతో చట్టప్రకారం ఏ చర్యలూ తీసుకునే వీలు ఉండదు.
దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోనుంది. ఈ ఏడాది మే నెలలోనే ప్రాంతీయ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, బీజేపీ కలసి మిత్రబంధాన్ని రూపొందించుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బీజేపీ అధికారంలోకి రానుంది. పీఏపీతో కలిసి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పావులు కదుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more