నీటి పంచాయితీలో ఎవరు గెలుస్తారు? | KCR Chandrababu attend apex committee for Water Issues.

Kcr chandrababu water war goes to uma bharti s chamber

KCR Chandrababu attend apex committee meeting, KCR Chandrababu Water War, Water War Goes to Uma Bharti's Chamber, Uma Bharathi on AP Telangana water issues, KCR CBN Apex committee

KCR Chandrababu attend apex committee meeting under Irrigation Minister Uma Bharathi for Water Issues.

నీటి పంచాయితీలో గెలుపెవరిది?

Posted: 09/21/2016 09:39 AM IST
Kcr chandrababu water war goes to uma bharti s chamber

తెలుగు రాష్ట్రాల మధ్య రెండున్నరేళ్లుగా నలుగుతున్న వాటర్ వార్ కి ముగింపు పలికేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై వివాదాలను కొలిక్కితెచ్చేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనుంది. ఇరు రాష్ట్రాల సీఎంలతోపాటు ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షతన భేటీ కానున్నారు. అయితే సమావేశం కేవలం అరగంటసేపు మాత్రమే జరగనుందని సమాచారం.

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు సరిగ్గా 2 గంటలకు సమావేశం కానున్నాయి. సమావేశం ప్రారంభమైన తరువాత కేంద్ర ప్రభుత్వ ప్రణాళికను 2:05 నిమిషాలకు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులకు పావు గంటసేపు వివరించనున్నారు. అనంతరం 2:20 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదన వినిపించనుంది. ఆ తరువాత 2:25 నిమిషాలకు తెలంగాణ ప్రభుత్వం తన వాదన వినిపించనుంది. 2:30 నిమిషాలకు సమావేశం ముగుస్తుంది, అనంతరం 2:30 నిమిషాలకు అధికారులతో సమావేశమైన అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతి 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇరు రాష్ట్రాల వాదనలు ఏంటంటే...

ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమతో గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే తెలంగాణకు దక్కే 90 టీఎంసీల వాటాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 టీఎంసీల నుంచి 422 టీఎంసీలకు తగ్గించాల్సిందిగా కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయమై మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరడానికి ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్.. అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు సిద్ధం చేసిన నివేదికలను అధ్యయనం చేయడంతో పాటు వాటిలో మార్పుచేర్పులపై కీలక సూచనలు చేశారు. ఏపీ లేవనెత్తే ప్రతీ అంశాన్ని సమర్థంగా తిప్పికొట్టేలా రాష్ట్ర వాదనలు సిద్ధం చేశారు. ఇక ఎజెండాలో లేని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) అంశాన్ని ప్రస్తావించాలని తెలంగాణ నిర్ణయించింది. చర్చలకు ఆహ్వానించినా.. ఏపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీనికి తోడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకముందే ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. ఈ అంశాలను అపెక్స్ కమిటీ ముందుంచాలని సీఎం నిర్ణయించారు.

ఇక ఏపీ విషయానికొస్తే.. నీటి వాటాల్లో ఉల్లంఘనలు, ప్రాజెక్టుల నియంత్రణపై చట్టంలో పేర్కొన్న అంశాలు, బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులు, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించిన అన్ని అంశాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా నివేదిక రూపంలో పొందుపరిచారు. పాలమూరు, దిండి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించేందుకు అన్ని రకాలుగా అస్త్రాలతో సిద్ధమయ్యారు చంద్రబాబు అండ్ అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Telangana  Water War  Apex Committee meeting  Uma Bharathi  

Other Articles