పెలబ్రిటీలతో సెల్పీలు తీసుకోవడం చాలా కామన్. వారెక్కడకైనా వస్తున్నారన్న సమాచారం తెలిస్తే చాలు వారి కోసం పరుగులు తీసి సెల్సీలు తీసుకుంటుంటారు అభిమానులు. ఇక మరికోందరు అభిమానులైతే వారి తల్లిదండ్రులకు తెలియకుండా వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తమ అభిమాన నటినటుల ఇళ్లముందు పడిగాపులు కాసి మరీ వారిని కలవకుండానే ఊసురుమంటూ వెనుదిరిగిపోతుంటారు. అయితే సాధారణ ప్రజతో సెలబ్రీటీలు సెల్పీలు దిడగం మాత్రం ఢిఫరెంట్. అయినా అలాంటి సెలబ్రిటీలు నేటి సమాజంలో వున్నారా.? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం కాకమానదు.
అయితే నేనున్నాను.. నేను అచ్చంగా అలాంటి నటినే అంటుంది నమిత. తమిళనాట అమ్మాయి కాకపోయినా అమె అందచందాలను అదరించి అక్కున చేర్చుకోవడంతో అమె అక్కడ కలల యువరాణిగా మారిపోయింది. అలాటి కలలరాణి చేసిన అసాధారణ ఫీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం అమె తక్కువ స్థాయిలో తమిళనాట తెరపై కనిపించినా, అసలు అమె తెరపై కనిపించకపోయినా సినీ జనాలేకాదు, సాధారణ ప్రజల్లోనూ ఆమె క్రేజే వేరు. ఇప్పటికీ ఏ నూతన షాపు ప్రారంభోత్సవానికి వెళ్లినా నమిత చుట్టూ జనం తొక్కిసలాట జరగాల్సిందే.
అందుకు తగ్గట్టుగానే ఆ ముద్దుగుమ్మ ప్రవర్తన ఉంటుంది. అందుకు గురువారం జరిగిన ఒక సంఘటనను ఒక చిన్న ఉదాహరణగా పేర్కొనవచ్చు. విషయం ఏమిటంటే నమిత గురువారం స్థానిక నెల్సన్‌మాణిక్యం రోడ్డులో కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో అటుగా ఒక మహిళ ఆటో నడుపుకుంటూ రావడం నమిత కంటపడింది. అంతే వెంటనే తన కారు ఆపి కిందకు దిగి ఆ మహిళా ఆటోడ్రైవర్‌ను కలిసి ఆమెతో టక్కున సెల్ఫీలు దిగారు.
ఈ ఊహించని పరిణామానికి ఆ మహిళా ఆటోడ్రైవర్ విస్మయానికి గురైంది. ఆనక తెరుకుని, మీరు తనతో ఫోటో దిగడం అన్నది నిజమా?కలా? అని నమితను అడిగింది. జీవితంలో నమ్మశక్యం కానిదేదీ లేదనీ, నమ్మకమే ప్రదానం అని నమిత ఆమెతో జీవిత సత్యాన్ని వివరించారు. ఆ మహిళ పేరు ధనలక్ష్మీ అని తెలుసుకుని కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న అమెను అభినందించడంతో పాటు అమెకు సెల్యూట్ అంటూ కితాబిచ్చింది. మహిళలు చేయలేని, చేయరాని పనులంటూ ఏమీ లేవని దానిని నిరూపించిన ధనలక్ష్మీని ప్రశంసలతో ముంచెత్తించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more