బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై మరోమారు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయన తన అభిమాన లోకంతో పాటు దేశ ప్రజలనుంచి విమర్శలను ఎదుర్కోంటున్నారు. పాకిస్థాన్ కు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. శివసేన, ఎంఎన్ఎస్ నాయకులు సల్మాన్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా శివసేన నాయకురాలు మనీషా కాయండే కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. సల్మాన్ ఖాన్‌కు ఈ విషయంలో పాఠం నేర్పించాలన్నారు. ఆయనకు పాకిస్థానీ నటులంటే అంత ప్రేమ ఉంటే.. ఆయన పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోవాలని ఆమె ఘాటుగా విమర్శించారు.
పాక్ నటీనటులు ఉగ్రవాదులు కారని, వాళ్లు ఇక్కడ పనిచేసేందుకు వర్క్ పర్మిట్ వీసా తీసుకుని మరీ వచ్చారని, వాళ్లకు వీసాలు మంజూరు చేసింది కూడా ప్రభుత్వమేనని సల్మాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఇంతకుముందు ఎంఎన్ఎస్ అగ్రనేత అమే ఖోప్కర్ కూడా స్పందించారు. చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదని, టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారని, ఇది చట్టవ్యతిరేకమని ఆయన అన్నారు. సల్మాన్ ఓ ట్యూబ్ లైట్
దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఇప్పటికైతే పాకిస్థానీ నటినటులు కనిపిస్తే దాడులు చేస్తామని.. ఆ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటామని కూడా అమే ఖోప్కర్ చెప్పారు. కాగా నెట్ జనులు కూడా సల్మాన్ ఖాన్ పై తీవ్రంగా స్పందించారు. అక్కడి నటినటులు తీవ్రవాదులు కాదని అయితే భారత్ పై దాడిని వారు ఖండించనూ లేదని ఇదే పెద్ద సమస్య అని కొందరు ట్విట్ చేయగా, అది నేను కాదు నా డ్రైవర్ ఇచ్చిన ఇడియాటిక్ ఐడియా అని గతంలో కారు ప్రమాదాన్ని ఊటంకిస్తూ క్రికెటర్ రవీంద్ర జడేజా అయనపై విమర్శలు గుప్పించారు. ఇక మరోకరు ఆయన కారు తాగింది.. కృష్ణ జింక అత్మహత్యకు పాల్పడింది.. ఆయన ప్రస్తుతం అత్యాచారం జరిగిన మహిళగా భావించవచ్చునంటూ గతంలో ఆయనపై వచ్చిన అభియోగాలన్నింటినీ పేర్కోంటూ విమర్శలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more