కుదటపడుతున్న అమ్మ అరోగ్యం.. కార్యకర్తల ప్రత్యేక పూజలు Jayalalithaa on respiratory support

Jayalalithaa on respiratory support responding adequately to treatment

jayalalithaa, jayalalithaa health, jayalalithaa dead, jayalalithaa apollo hospital, jayalalithaa health bulletin, amma health, amma hospital, jayalalithaa hospital, jayalalithaa rumours, jayalalithaa news, tamil nadu news

Tamil Nadu CM J Jayalalithaa is on respiratory support and is being treated with antibiotics and allied clinical measures for her infection, said a press release issued by Apollo Hospitals

కుదుటపడుతున్న అమ్మ ఆరోగ్యం.. కార్యకర్తల ప్రత్యేక పూజలు

Posted: 10/04/2016 10:02 AM IST
Jayalalithaa on respiratory support responding adequately to treatment

రక్తనాళాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా గత పన్నెండు రోజుల నుంచి చెన్నై అస్పత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి,  అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది. అమె కొద్దికొద్దిగా కోలుకుంటున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కోన్నారు. జయలలిత శరీరంలో సోకిన ఇన్ఫెక్షన్ తగ్గేందుకు సాధారణ యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇన్‌ఫెక్షన్స్ పూర్తిగా తగ్గేందుకు మరికొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు.
 
జయలలిత అరోగ్యం కాసింత కుదుటపడటంతో అమె కళ్లు తెరచి చూసినట్లు అస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక అమె మద్య మధ్యలో వెంటిలేటర్ సాయం లేకుండా సొంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపాయి. దీంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు అమ్మ ఆరోగ్యం బాగుండాలని ఆమె వేగంగా కోలుకుని సంపూర్ణ ఆర్యోగంతో డిశ్చార్జ్ కావాలని ప్రార్థిస్తూ కార్యకర్తలు తమిళనాడులోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆర్కేనగర్  నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అలంకరించిన కలశాలను తలపై ఉంచుకుని ఊరేగింపు జరిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  health  vidyasagar rao  appollo hospitals  chennai  tamilnadu news  

Other Articles