ఆ మానవ మృగం మానవత్వం మరిచిపోయింది. నిండా పదేళ్లు కూడా లేని పిల్లాడిపై రెచ్చిపోయాడు. వడివడిగా బడివైపు అడుగులు వేయాల్సిన ఆ బాలుడి కాళ్లను విరిచేశాడు. బలం పట్టి పలకను దిద్దాల్సిన ఆ చేతులను మెలి తిప్పేశాడు. ఎంత విలవిల లాడిపోయాడో బిడ్డ పాపం గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. అడుక్కోవాలని ఆదేశిస్తూ ఓ మృగం వాతలు పెట్టడంతోపాటు, పిల్లాడికి లేని అంగవైకల్యం ఇచ్చాడు. ఫలితం ఆ బాధను తట్టుకోలేని ఆ పిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ విషాదం చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది.
జూపాడు బంగ్లా మండలం లింగాపురానికి చెందిన గోపాల్(55) పనీపాట లేకుండా తిరుగుతున్నాడు. వెలుగోడు సమీపంలో నివాసం ఏర్పరచుకున్న గోపాల్.. ప్రకాశం జిల్లాకు చెందిన గణేశ్ అనే బాలుడిని ఇటీవల వెంట తీసుకొచ్చి అతడితో భిక్షాటన చేయించేవాడు. భిక్షాటనకు నిరాకరించిన బాలుడిని గోపాల్‌తో పాటు అతడితో సహజీవనం చేస్తున్న లక్ష్మి కూడా తరచూ కొట్టి భిక్షాటనకు పంపేవారు. రెండు రోజుల క్రితం కూడా ఇద్దరూ కలిసి బాలుడిని చావబాదారు. దీంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు.
తాను బాలుడి తాతనని చెబుతూ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో గణేశ్‌ను చేర్చాడు. బాలుడి తండ్రి రాజశేఖర్ కొడుకును కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడని వైద్యులను నమ్మించాడు. కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలపాలైన బాలుడిని చూసి చలించిపోయిన వైద్యులు వెంటనే చిన్నారికి వైద్యం అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. విషయం తెలిసిన గోపాల్, లక్ష్మి.. గణేశ్ మృతదేహాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more