పెట్రోల్ బంకు డీలర్ల దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా వున్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. పెట్రోల్ బంక్ డీలర్లు భారత్ బంద్ కు పూనుకుంటున్నారు. పదే పదే తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా వాటిని పరిష్కరించకుండా పెడచెవిన పెడుతుందని వారు అరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు దశలవారిగా నిరసన తెలుపుతామని పెట్రోల్ బంకు డీలర్ల అసోసియేషన్ వెల్లడించింది.
పూర్తిగా పెట్రోల్ బంకులను మూసేసి వాహనదారులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యం తమకు లేదని, దీంతో ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లే క్రమంలో నిరసన కార్యక్రమాలు చేపడతున్నట్టు.. ఇందుక గానే ఒక కార్యచరణ ప్రణాళికను కూడా రూపోందించికున్నట్లు తెలుపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 19, 26 తేదీలలో సాయంత్రం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నవంబర్ 3, 4 తేదీలలో ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తామని, నవంబర్ 5న సాయంత్రం 6గంటలకు పెట్రోల్ బంక్‌లు మూసివేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు రావిగోపాలకృష్ణ తెలిపారు.
నవంబర్ 6న పెట్రల్‌బంక్‌లు తెరవబోమని కూడా చెప్పారు. అలాగే ప్రతీ నెలా 2, 4 శనివారాలు, ప్రతీ ఆదివారం అదే విధంగా సెలవు రోజుల్లో కూడా బంక్‌లు పనిచేయమని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వ దిగిరాని పక్షంలో నవంబర్ 7 నుంచి కేవలం ప్రభుత్వ కార్యాలయ వేళల్లోనే పెట్రోల్ విక్రయాలు జరుపుతామని వారు ప్రభుత్వానికి హెచ్చరించారు. గత కొన్నా ఏళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతో పెట్రోల్‌బంక్ డీలర్ల అసోసియేషన్ నిరసన కార్యక్రమాలకు దిగారు. కాగా ఇది తమ జాతీయ అసోసియేషన్ డీలర్లు ఇచ్చిన పిలుపులో భాగంగానే జరుగుతుందని వారు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more