కారులోన తిరిగే కిలాడీలేడికి ఖర్చుకు పైసలే కరువైపాయే.. Watch out for 'distressed' woman who steals phones

Well dressed woman thief duping students with her class act

Delhi, Woman thief, North Delhi crime, Mukherjee Nagar, Crime, Cellphone theft, class lady thief, lady thief in honda brio, lady thief with branded clothes, woman thief with matching assessories, delhi lady theif, lady thief delhi police

She is a phone thief but her deception is impossible to read, a woman in her twenties, drives a white Honda Brio, wears branded clothes with matching accessories and speaks fluent English.

కారులోన తిరిగే కిలాడీలేడికి ఖర్చుకు కాసులే కరువైపాయే..

Posted: 10/09/2016 10:53 AM IST
Well dressed woman thief duping students with her class act

నాంపల్లి స్టేషను కాడి రాజలింగో.. రాజలింగా.. అన్న పాటలో కారులోన తిరిగే తల్లికి కట్టే బట్టే కరువైపాయే అన్న చరణం వుంది, దాని యధాతధంగా అమలు చేయడం ఎందుకనుకుందో ఏమో తెలియదు కానీ ఈ కిలాడీ లేడి మాత్రం కారులోన తిరిగే లేడికి ఖర్చుకు కాసులు కరువైపాయే అన్న మార్చేసింది. అదేంటీ.. ఏమా కథ అంటారా..? బ్రాండెడ్ వస్త్రాలకు తోడు మ్యాచింగ్ నగలు, గాజులు ధరించి టిప్ టాప్‌గా కనిపిస్తూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే 20 ఏళ్ల కిలాడీ లేడీ తెల్లటి హోండా బ్రియో కారులో వచ్చి విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లను దోచుకెళుతోంది.

కారులో వచ్చి ఫలానా అడ్రసుకు ఎలా వెళ్లాలో దారి అడిగి...ఆపై తన మొబైల్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందని, అర్జంట్ కాల్ మాట్లాడాలని చెప్పి ఫోన్ అడిగి తీసుకొని, ఫోన్ తో కారులో పారిపోతున్న కిలాడీ లేడీ కోసం ఢిల్లీ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇలా మూడు రోజుల్లో నలుగురు విద్యార్థుల నుంచి స్మార్ట్ ఫోన్లను దోచుకెళ్లిన మహిళ గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఈ కిలాడీ తాజాగా ఢిల్లీ ముఖర్జీనగర్ ప్రాంతంలో ఫోన్ దోచుకెళ్లింది. అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన యువతి ఉన్నత విద్యావంతురాలిగా కనిపించిందని టాబ్లెట్ పోగొట్టుకున్న చేతన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాను వెంటపడినా టాబ్లెట్ తీసుకొని దొరకకుండా కారులో వేగంగా పారి పోయిందని ఆమె పేర్కొంది. బుధ, శుక్రవారాల్లో కిలాడీ లేడీ నలుగురి ఫోన్లను దోచుకెళ్లినా, బాధితులెవరూ యువతి కారు రిజిస్ట్రేషన్ నెంబరు మాత్రం చెప్పలేకపోతున్నారు. శిక్షణ సంస్థలకు కేంద్రమైన ముఖర్జీనగర్ ప్రాంతంలోనే కిలాడీ లేడీ దోచుకుంటుందని పోలీసులు చెప్పారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని రోజులుగా స్మార్ట్ ఫోన్లను దోచుకుంటున్న కిలాడీ లేడీ ఢిల్లీ పోలీసులకే సవాలుగా మారింది.ఈ కిలాడీ లేడీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించే పనిలో పడ్డారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Woman thief  North Delhi crime  Mukherjee Nagar  Crime  Cellphone theft  

Other Articles