దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 6 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసేసింది. మూడో పార్టీ ఏటీఎం యంత్రాల ద్వారా పలు అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించిన ఎస్బీఐ తమ ఖాతాదారులకు చెందిన 6.25 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసింది. ఈ విషయం తెలియని ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు.
కార్డు బ్లాక్ చేసిన సంగతిని ఎస్ఎంఎస్, ఈమెయిళ్ల ద్వారా ఖాతాదారులకు తెలియజేస్తున్నట్టు ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. కార్డు బ్లాక్ అయినవారు దగ్గరల్లోని బ్రాంచ్‌కు వెళ్లి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా పలు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడంతో కార్డులను బ్లాక్ చేశామని అధికారులు పేర్కొన్నారు.
అనుమానాస్పద లావాదేవీల బెడద ఒక్క ఎస్బీఐకే లేదని, ప్రైవేటు, విదేశీ బ్యాంకు కార్డులకు కూడా ప్రమాదం పొంచి ఉందని వివరించారు. నెల రోజుల క్రితం ఖాతాదారుల సమాచారం హ్యాక్ అయినట్టు గుర్తించే కార్డులను బ్లాక్ చేసినట్టు అధికారులు తెలిపారు. కార్డు బ్లాక్ కానివారు వెంటనే తమ పిన్ నంబర్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. సో... ఒకసారి మీ కార్డును కూడా చెక్ చేస్కోండి మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more