మూగ జీవాల ఉసురు తీసినట్లు అభియోగాలు ఎదుర్కోంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు కష్టాలు వీడేలా లేవు. ఈ కేసులో ఆయనను నిర్ధోషిగా రాజస్థాన్ హైకోర్టు తీర్పును వెలువరించడంతో ఊరట పోందిన సల్మాన్ ఖాన్ కు మళ్లీ అదే కేసులో నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ నిర్ధోషిత్వాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించింది.
ఈ ఏడాది జూలై 25న రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అపీలుకు వెళ్లింది. అయితే రాజస్థాన్ ప్రభుత్వం అపీలును స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దీపావళి సెలవుల తరువాత తమ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటీషన్ పై విచారణను చేపట్టవచ్చునని రాజస్థాన్ అడ్వకేట్ జనరల్ శివమంగళ్ శర్మ తెలిపారు.
కాగా 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను, ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. సల్మాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు.. భావద్ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. సరైన సాక్షాలు లేవని సల్మాన్‌ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more