కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత పార్టీలోనే కాదు.. ప్రజల దృష్టిలో కూడా రాను రాను చులకన అయిపోతున్నాడు. ఇన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంకా అ..ఆ... లు దిద్దే స్టేజీలోనే ఉన్నాడేమో అన్న చందాన మాట్లాడుతూ పరువు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే దేశానికి కాబోయే ప్రధాని అని కార్యకర్తలతో చాటింపు వేయించుకుంటున్న ఆయనగారికి ముంబై అమ్మాయిలు భలే పంచ్ ఇచ్చారు.
షిట్ చాట్ అనే ఓ టీవీ షోలో ప్రాంక్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న రాహుల్ గాంధీ మీకు పెళ్లి ప్రపోజ్ చేస్తే మీ ఒపినీయన్ ఏంటి? అని అడుగుతాడు. వారి నుంచి వచ్చిన సమాధానం వింటే పాపం రాహుల్ గాంధీ అనుకోవాల్సిందే. ఓ పాతిక మందిని ప్రశ్నిస్తే ఒక్క అమ్మాయి తప్ప(ఆమెకి రాజకీయాలంటే చాలా ఆసక్తంట), మిగతా అందరూ నో అనే సమాధానం చెప్పారు. రాహుల్ ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని, తల్లి చాటు నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని కొందరు అంటే... ముసలోడు అయిపోయాడు అంటూ మరికొందరు సమాధానం ఇచ్చారు.
ఇక ఇంకొందరైతే రాహుల్ అందగాడే గానీ, మాటకారి కాదంటూ తేల్చేశారు. దేశానికే ఏం చేయలేని వాడు.. మాకేం చేస్తాడంటూ మరికొందరు చెప్పారు. పప్పును ఎవరైనా చేసుకుంటారా అని, ఛీ... యాక్.. అంటూ అసహ్యామైన భావాలు పెడుతూ మరికొందరు తప్పించుకున్నారు. తానసలు అమ్మాయినే కాదంటూ అక్కడి నుంచి పారిపోతానని మరో యువతి చెప్పింది. మొత్తానికి రాజకీయ భవిష్యత్తు ఏమోగానీ వైవాహిక జీవితానికి సంబంధించి మాత్రం వారిచ్చిన పంచ్ ల వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more