బాయ్ ఫ్రెండ్ అని బైక్ ఎక్కింది.. కానీ.. దూకేసింది.. Teen girl great escape from kidnap and gangrape

Teen girl escapes kidnap and gangrape by jumping from running bike

teen girl foils abduction, teen girl escapes rape, Teen girl escapes kidnap, Teen girl escapes gangrape, Teen girl jumps from running bike, Teen girl running bike, teen girl, abuction, kidnap, molestation, gang rape, pedapalli, Telangana, Crime

Teen girl escapes kidnap and gangrape by jumping from running bike in peddapalli of telangana

బాయ్ ఫ్రెండ్ లాంటోడేనని బైక్ ఎక్కింది.. కానీ.. దూకేసింది..

Posted: 10/22/2016 11:40 AM IST
Teen girl escapes kidnap and gangrape by jumping from running bike

టీనేజ్ అమ్మాయిని ట్రాప్ చేసిన యువకుడు అమెను బ్లాక్ మెయిల్ చేసి.. కిడ్నాప్ అ తరువాత అమెపై గ్యాంగ్ రేప్ కు ప్రణాళిక రచించుకున్నాడు. అయితే ఆ నయవంచకుడి కుట్రను కాసింత ముందుగానే పసిగట్టిన యువతి ఏకంగా నడుస్తున బైక్ పై నుంచి దూకేసింది. ఇంతలా ధైర్యం చేసి.. నయవంచకుని కబంధ హస్తాలకు చిక్కకుండా గాయలతో బయటపడింది. ఈ ఘటన  పెద్దపల్లిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అమె స్థానిక అస్పత్రిలో చికిత్స పొందుతుంది.

వివరాల్లోకి సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన 18 ఏళ్ల యువతికి పెద్దపల్లికి చెందిన సాయికుమార్ ఫోన్‌లో నాలుగురోజుల క్రితం పరిచయమయ్యాడు. సరేలే కదా అని అతనితో మాట్లాడటం ప్రారంభించింది. అది కాస్తా ఒకింత చనువుకు దారి తీసింది. ఈ క్రమంలో యువకుడు అమెను పెద్దపల్లికి రావాలని కోరాడు. అయితే యువతి నిరాకరించింది. తనతో ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణలు రికార్డు చేశానని, వాటిని మీ గ్రామంలోకి వచ్చి.. అక్కడి తన మిత్రులకు పంచుతానని. నీ గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది.

దీంతో కాసింత భయపడిన సదరు యువతి ధైర్యం చేసుకుని అక్క కొడుకుతో పెద్దపల్లికి వచ్చింది. బైక్ ఎక్కాల్సిందిగా యువకుడు కోరాడు. లేదు ఇక్కడి వరకే వెళ్లివద్దాం అని కోరగా, సరే బాయ్ ఫ్రెండే కధా అని కోడుకు వరుసైన బాలుడ్ని అక్కడే వదిలేసి..  బైక్ ఎక్కింది. క్రమంగా బైక్ స్పీడందుకుంది. స్థానిక శాంతినగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి మీదుగా వెళ్తున్న క్రమంలో సాయికుమార్ మరో ఇద్దరు యువకులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వారు వెంబడిస్తున్న విషయాన్ని గ్రహించిన యువతి.. కీడును శంఖించి.. నడుస్తున్న బైక్ పైనుంచి దూకేసింది.

దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలుకాగా, యువకుడు పరారయ్యాడు. సాయికుమార్ ఫోన్ నెంబర్ అధారంగా అతను ఎవరికి ఫోన్ చేసింది తదితర విషాలను తమ దర్యాప్తులో వెల్లడవుతుందని కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు. ముందుగా యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎసై తెలిపారు. ఈ ఘటనపై సమాచారం తెలియగానే ఆస్పత్రికి కానిస్టేబుల్‌ను పంపించానని, ఆస్పత్రిలో ఎవరూ లేరని, ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అపరిచితులు ఫోన్ లో ట్రాప్ చేస్తారని, ఈ ఘటనే అందుకు ఉదాహరణ అని వాటిపట్ల అడపడచులు జాగ్రత్తగా వుండాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teen girl  escape  abuction  kidnap  molestation  gang rape  pedapalli  Telangana  Crime  

Other Articles