తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంఘం (తానా) పై వస్తున్న అవినీతి ఆరోపణలు సరికొత్త మలుపు తిరిగింది. సంఘంలోని మిగతా సభ్యులకు చెప్పకుండా సొమ్మును పక్కదారి పట్టించారని కొందరు ఆరోపణలకు దిగటంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా డిజిటల్ తరగతుల కోసం ఎన్నారైల నుంచి విరాళాలను ఆహ్వానించింది. దీనికి తానా 4.50 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. అమెరికాలో ఏపీ ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి ఆ చెక్కును రీసెంట్ గా సీఎం చంద్రబాబుకు అందజేశాడు కూడా.
అయితే ఈ భారీ విరాళం వెనుక గోల్ మాట్ ఉందంటూ ఆరోపణలు వినిపించాయి. గతంలో హుధూద్ కోసం సేకరించిన ఈ విరాళాలను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వినయోగించారంటూ ఆరోపణలు వినిపించాయి. తానా మాజీ అధ్యక్షుడు నన్నపనేని మోహన్ హయాంలో అప్పటి పూర్వపు విద్యార్థులంతా కలిసి విశాఖ హుద్‌హుద్ తుపాను బాధిత ప్రాంతాల్లో గృహాలు, పాఠశాలల నిర్మాణానికి సుమారు 3 లక్షల 6 వేలడాలర్లు (రూ. 2 కోట్లు) నిధులు సేకరించి తానా ఫౌండేషన్‌కు అందజేశారు. అయితే ఆ సొమ్మునే ఇప్పుడిలా వాడుతున్నరన్నది అసలు ఆరోపణ. కానీ, ఆ సొమ్ము ఇప్పటికీ ఆయా ఖాతాల్లోనే పదిలంగా ఉన్నాయని చెబుతున్నారు తానా అధ్యక్షుడు జంపాలచౌదరి. ఈ నిధుల్లో సగం డిజిటల్ తరగతులకు, మిగిలిన సగం అంగన్వాడీ కేంద్రాలకు వెచ్చించాలని జులై 13న తానా కార్యవర్గం నిర్ణయించినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
అది పక్కనబెడితే తానా మాజీ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని అమెరికావ్యాప్తంగా పర్యటించి మరో లక్షా 5 వేల డాలర్లను ప్రవాసుల నుంచి సేకరించారు. మరో 75 వేల డాలర్లు ఎన్నారైల నుండి హామీలు కూడా లభించాయి. ఇదిలావుండగా లక్షా 5 వేల డాలర్లకు, తానా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, కాకపోతే భారతదేశం - అమెరికా ప్రభుత్వాల నుండి సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం తానాకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
ప్రవాస తెలుగు ప్రజలు అందించిన లక్షా 5వేల డాలర్లను తానా ఫౌండేషన్ ద్వారా భారత్‌కు తరలించారు. మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి తొలివిడతలో ఏపీలో 1000 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రతి పాఠశాలకు 45 వేల రూపాయిల ఖర్చును ప్రవాసులు భరిస్తే.. మిగతా ఖర్చంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఆ లెక్కన్న 1000 స్కూళ్లకు 45 వేల చొప్పున రూ.4.5 కోట్లు. ఈ మేరకు అనధికారిక చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. అంటే ఆ రూ.4.5 కోట్లు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు ముందస్తు హామీ మాత్రమే!
ఇక ప్రభుత్వానికి ఆ రోజున విశాఖలో ఇచ్చిన అసలు మొత్తం సుమారు రూ.75లక్షలు(లక్షా 5 వేల డాలర్లు) మాత్రమే. ఈ లక్షా 5వేల డాలర్లు కాకుండా జయరాంకు అమెరికాలో తన పర్యటనల్లో ప్రవాసులు మరో 75 వేల డాలర్లు అందిస్తామని వాగ్దానాలు చేశారు. ఆ నిధులు సేకరించిన అనంతరం వాటిని కూడా ప్రభుత్వానికి అందిస్తారని జంపాల లెక్కలతోసహా వివరించారు. దీంతో తానా నిధుల గోల్ మాల్ అంతా ఉత్తదేనని తేలిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more