కల్కి భగవాన్ కండిషన్ సీరియస్ ? | kalki bhagavan health in critical condition

Kalki bhagavan health in critical condition

kalki bhagavan serious, spiritual teacher kalki bhagavan health, kalki bhagavan Apollo, after Amma now Kalki Baghavan, Kalki baghawan health bulletin

kalki bhagavan health in critical condition admitted in Chennai Apollo.

కల్కి భగవాన్ కి సీరియస్?

Posted: 10/29/2016 08:10 AM IST
Kalki bhagavan health in critical condition

చెన్నైలోని అపోలో ఆస్పత్రికి జనసందోహం విపరీతంగా పెరిగిపోయింది. గత కొద్ది రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అక్కడికి వీఐపీల పరామర్శ పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కూడా కల్కి భగవాన్‌ అందులోనే చేర్చారు.

గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని పరిస్థితి విషమించటంతో బంధవులు రెండు రోజుల క్రితం అపోలోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అత్యవసర సేవా విభాగం(ఐసీయూ) లో ఉంచి ఆయనకి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు.

కాగా, తమ గురువు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు అపోలోకి ఎగబడిపోతున్నారు. బయట వందల సంఖ్యలో బారులు తీరుతునండటంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంకా అమ్మ డిశ్చార్జి కాకపోవటంతో చేసేది లేక గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spiritual teacher  Kalki bhagavan  health  serious  apollo  

Other Articles