ముద్దులొలికే యశోధా ముంగిట ముత్యము వీడు.. అంటూ ప్రతీ తల్లిదండ్రులు వారి చిన్నారులను చూసి పాడుకోవడం సాధారణమే. వారేంచేసినా చివరకు ఏడ్చినా.. ఆనందం కలిగిస్తుంది. ముద్దుముద్దుగా ఉండే వారి చేష్టలు తల్లిదండ్రులకు చెప్పలేనంత సంతోషాన్నిస్తాయి. అందుకే చిన్నారుల వీడియోలు సోషల్‌మీడియాలో బాగా క్లిక్ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. పుట్టిన బిడ్డ ముందుగా గుర్తుపట్టేది అమ్మనే. ఆ తల్లితో అత్యంత చనువుగా వుంటే వ్యక్తిని ఆ తరువాత గుర్తుపడతాడు. అలా అలా సమీప బందువులను.. తరువాత ప్రపంచాన్ని గుర్తిస్తాడు.
అయితే నెల రోజుల వ్యవధిలో వున్న బుజ్జియి తమ తల్లిని మాత్రమే గుర్తు పట్టాడు. తన ఎదుట తన తల్లిని ముద్దుపెట్టుకుంటున్న వ్యక్తిని ఎవరో తన తల్లిని మద్దుపెట్టుపెట్టుకుంటున్నారని ఏకంగా తనకు వచ్చిన ఏడుపురాగాన్ని అందుకున్నాడు. అయితే అతను నాన్నే అని, తామిద్దరం తనను ప్రేమిస్తున్నామని చెప్పగానే ఏడుపు ముఖం కాస్తా నవ్వుముఖంగా మారిపోతుంది. ఆ తరువాత తన తల్లిన మళ్లి ముద్దుపెట్టుకోగానే ఈ చిన్నారికి చెప్పలేనంత ఉక్రోషమేమో.. వారి ముద్దుపెట్టుకున్న ప్రతిసారీ ఈ బుజ్జియి తన రాగాన్ని అందుకోవడం.. చూడటానికి ఎంతో సరదాగా వుంది.
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన చెందిన మ్యాత్- క్రిస్సీ దంపతుల చిన్నారి కూతురు ఎల్లా. ఎప్పుడూ ఆనందంగా ఉండే ఈ చిన్నారికి ఓ చిత్రమైన అలవాటు ఉంది. అదేమిటంటే తన ముందు అమ్మానాన్న ముద్దుపెట్టుకున్నారనుకో.. తను విషాదంగా ముఖం పెట్టి.. ఒక్కసారిగా ఏడుపు లంకించుకుంటుంది. ఈ అలవాటును గుర్తించిన తల్లిదండ్రులను ఆ చిన్నారిని ఆటపట్టిస్తూ ఆ వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. ఈ వీడియోను ఏకంగా 1.40 కోట్లమంది చూశారు. 1.35 లక్షల సార్లు షేర్చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more