మరింత పెరిగిన బాబుగారి భద్రత security tightened to AP CM Chandrababu

Security tightened to ap cm chandrababu

maoists, AOB area, chandrababu naidu, ap chief minister, security, encounter, malkangiri, odisha andhra pradesh border, encounter, malkangiri, maoists killed, odisha maoists, news, odisha andhra pradesh maoists, top maoists killed, top naxals killed, news, india news

In a threatening letter to Andhra pradesh chief minister from maoists after 23 members CPI (Maoist) were killed in an encounter at malkangiri, security tightened to chief minister chandrababu.

మరింత పెరిగిన చంద్రబాబు భద్రత

Posted: 10/29/2016 07:35 PM IST
Security tightened to ap cm chandrababu

మావోయిస్టుల ఊహకందని విధంగా భారీ దెబ్బ కోట్టి.. వారి ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి.. 23 మంది మావోయిస్టులను హతమార్చిన నేపథ్యంలో ప్రతీకారేచ్చ తో రగలిపోతున్న మావోలు ఏదైనా ఘాతుకానికి పాల్పడవచ్చున్న హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తాము ప్రతీకారాన్ని తీర్చుకుంటామని మావోలు హెచ్చిరస్తూ లేఖను కూడా రాసిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి మరింత భద్రతను పెట్టారు.

దీంతో చంద్రబాబుకు భద్రతగా కమాండోల సంఖ్యను మరింత పెంచారు. ఉండవల్లిలోని నివాసంతో పాటు, విజయవాడలోని సీఎం కార్యాలయంలో భద్రత పెంపుతో పాటు ముఖ్యమంత్రి పర్యటనపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రిని కలిసే వ్యక్తులపై నియంత్రణతో పాటు, సామన్యులకు అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు మావోయిస్టు ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పర్యటించేటప్పుడు తమకు సమాచారం ఇవ్వడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కాగా ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో 30మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  AOB area  chandrababu naidu  ap chief minister  security  encounter  malkangiri  

Other Articles