పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఓ రౌడీషీటర్ ను అతని అనుచరులు చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. శ్రీరామ్ అండదండలతోనే అనుచరులు రెచ్చిపోయి ఇలా దాడులు చేస్తున్నారనే విమర్శలు తీవ్ర తరం అయ్యాయి. ఈ అంశంలోకి లోతుగా వెళ్లితే... రాప్తాడు నడిబొడ్డున ఒక పీజీ విద్యార్థిని ఓబులేష్ అనే రౌడీషీటర్ వేధించిన సంఘటనలో నగేష్ చౌదరి అనే వ్యక్తి దారుణంగా చితకబాదిన సంఘటన ఇటీవల జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ ఛానెళ్లలో ప్రసారమైంది కూడా.
అయితే, సదరు విద్యార్థిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తే నగేష్ చౌదరి.. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కారు డ్రైవర్ కూడా అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక న్యూస్ ఛానెల్ తో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, ‘నగేష్ చౌదరి వెనుక మేమున్నామనే విషయం ముఖ్యం కాదు. అది వ్యక్తిగత విషయం. ఆరోజు వాళ్లు రియాక్ట్ అవడానికి కారణం వారి వెనుక ఎవరో ఉన్నారని కాదు. ఈ సంఘటనపై లోతుగా ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి.
అందరిలాగే మేము చట్టాన్ని గౌరవిస్తాం. చట్టాన్ని గౌరవించద్దంటూ మేమేమీ క్లాసులు పెట్టి చెప్పట్లేదు. ఈ సంఘటనలో అతను రియాక్ట్ అయిన పద్ధతి కరెక్టని నేను చెప్పను. అయితే, వాళ్లు ఎంత బాధతో ఉంటేనో, ఆ అమ్మాయిని ఎంతగా వేధిస్తేనో ఆవిధంగా వాళ్లు రియాక్ట్ అయి ఉంటారో మనం ఆలోచించాలి. ఇంట్లో ఆడపిల్లలను ఎవరైనా వేధిస్తే నేనైనా అలాగే రియాక్ట్ అవుతాను. అది నా క్షణికావేశం కావచ్చు, ఆలోచన కావచ్చు’ అని సమాధానం చెప్పారు.
‘అమ్మాయిల్ని వేధించిన వారెవరైనా మీ దగ్గరకు వస్తే మీ ప్రైవేట్ సైన్యంతో సమస్యను పరిష్కరిస్తారా?’ అనే ప్రశ్నకు పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ, ‘ప్రైవేట్ సైన్యంతో కాదు, అమ్మాయిలతోనే సమస్యను పరిష్కరిస్తాను. తప్పు జరిగినప్పుడు ప్రైవేట్ సైన్యం పెట్టి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు వాళ్లకు వాళ్లు రియాక్ట్ అయ్యేటట్లు, మహిళా సంఘాలు రియాక్ట్ అయ్యేటట్లు, పోలీసులు స్పందించేటట్లు చేసేందుకు మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది’ అని తేల్చి చెప్పాడు శ్రీరామ్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more