కామ పిశాచి: బూతు వీడియోలు, బాత్ రూంలో సీసీ కెమెరాలు | Girl Students on Warpath over Sexual Harassment

Girl students on warpath over sexual harassment

Rajamahendravaram KJR Pharma College, Sexual Harassment of College Staff, college staff harassment with sexual videos, CC cameras in ladies toilets, CC cameras in ladies hostels rest room, Girl Students on Warpath over Sexual Harassment

Girl Students on Warpath over Sexual Harassment of College Staff Member in Rajamahendravaram.

వాడో పెద్ద కామ పిశాచి... అయినా వినలేదంట!

Posted: 11/03/2016 09:46 AM IST
Girl students on warpath over sexual harassment

బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి అసహ్యామైన పనులకు పాల్పడ్డాడు అతగాడు. రెస్ట్ రూమ్ లలో సీసీ కెమెరాలు పెట్టి వారిని నగ్నంగా చిత్రించి బ్లాక్ మెయిలింగ్ చేయటం, కోరికలు తీర్చాలంటూ వేధించటం చేస్తూ వస్తున్నాడు. చాలా కాలంగా భరిస్తూ వస్తున్న ఆ యువతులు ధైర్యం చేసి యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే ఇంకోవైపు యాజమాన్యం కూడా పెద్ద షాకే ఇచ్చింది.

ఆంద్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలోని కేజేఆర్ ఫార్మా కాలేజీలో చోటుచేసుకున్న ఘటన వివరాళ్లోకి వెళ్లితే.... అకౌంటెంట్ గా పనిచేస్తూ, విద్యార్థినుల హాస్టల్ కు ఇన్ చార్జ్ గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థినులకు ఏ అవసరం వచ్చినా, తన దగ్గరకే రావాల్సి వుండటంతో, ఆ అవసరాన్ని అలుసుగా తీసుకుని ద్వందార్థాలతో మాట్లాడటం, అసభ్యకరమైన వీడియోలు పంపండం వంటివి చేస్తున్నాడంట.

అంతే కాదు కాలేజీ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా, ఫలితం లేకపోయిందని ఆరోపించారు. కాగా, ఈ ఘటనలపై యాజమాన్యం స్పందిస్తూ, శ్రీనివాస్ ను విధుల నుంచి తొలగించేందుకు అంగీకరింలేదని తెలుస్తోంది. ఆయనతో క్షమాపణలు మాత్రం చెప్పిస్తామని వెల్లడించగా, విద్యార్థినులు అందుకు అంగీకరించలేదు. వీరి నిరసనలతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. న్యాయం చేస్తామని వారి నుంచి వచ్చిన హామీ మేరకు ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girl Students  Sexual Harassment  Rajamahendravaram  Pharma college  

Other Articles