దొంగతనం కేసులో మిస్ యుఎస్, టీవీ యాంకర్ అరెస్టు Beauty Queen and Los Angels TV anchor arrested for theft

Beauty queen and los angels tv anchor arrested for theft suspicion

Frances Louise Parker, Miss USA 1994, Beauty Queen arrest, former Miss USA, Los Angels TV anchor, Theft case on Lu parker, miss usa theft case, los angles police department, beauty Queen theft case, miss usa head set.

The former beauty queen was booked on suspicion of petty theft and is being held at the Los Angeles Police Department’s Pacific Division.

దొంగతనం కేసులో మిస్ యుఎస్, టీవీ యాంకర్ అరెస్టు

Posted: 11/04/2016 09:15 PM IST
Beauty queen and los angels tv anchor arrested for theft suspicion

దొంగ‌త‌నం కేసులో అమెరికాలో అందాల అమ్ముడు అరెస్ట్ అయ్యింది. మాజీ మిస్ అమెరికా టైటిల్ ను సాధించిన ఫ్రాన్సెస్ లూయిస్ పార్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అమ్మడు ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ టీవీ యాంకర్ గా ఓ ప్రైవేటు ఛానెల్ లో విధులు నిర్వహిస్తుంది. ఆమె తోటి ప్రయాణికుడి హెడ్ సెట్స్ను తీసుకోవడంతో ఆమెపై ఈ కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న‌. లాస్ ఎంజిలెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

విమానాశ్రయంలో ఆరో టర్మినల్లో వెళ్తున్న ఓ ప్రయాణికుడు తన వస్తువులు పోయినట్లు అధికారులకు ఫిర్యాదు చేయగా, సెక్యూరిటీ వీడియోలను పరిశీలించారు. పార్కర్ హెడ్ ఫోన్స్ తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను విమానంలో నుంచి దించి వేసి, దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. అంతకుముందు క్యూ లైన్లో పార్కర్ తీసుకున్న హెడ్ ఫోన్స్ను వాటి యజమానికి ఇవ్వాలని ఆమె భావించారని అమె స్నేహితులు తెలిపారు.

అయితే యజమానిని గుర్తించలేకపోయారని, విమానం బయల్దేరే సమయమవడంతో ఆమె హెడ్ ఫోన్స్ తీసుకుని విమానం ఎక్కారని సన్నిహితులు చెప్పారు. అధికారులు పొరపాటుపడ్డారని తెలిపారు. జంతు సంరక్షణ కార్యకర్తగా, న్యూస్ యాంకర్గా పార్కర్ సుపరిచితురాలు. 1994 మిస్ యూనివర్స్ పోటీల్లో సుష్మితా సేన్ విజేతగా నిలవగా, పార్కర్ టాప్-6లో నిలిచింది. 2016 మిస్ టీన్ అమెరికా పోటీల్లో ఆమె జడ్జిగా వ్యవహరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Frances Louise Parker  Miss USA 1994  Beauty Queen arrest  

Other Articles