ట్రంప్ కి గుంటూరు తో ఉన్న సంబంధం ఏంటి? | Trump relation with Guntur.

Us elections effect in guntur

Guntur US elections, Donald Trump US elections, Donald Trump Guntur, Americal elections 2016, America elections, Hillary vs Trump, TANA support to Trump, NRI supports to Hillary, Indians in US elections 2016

Guntur people anxiety on US presidential elections.

అమెరికా ఎన్నికలతో గుంటూరులో హైటెన్షన్

Posted: 11/05/2016 07:50 AM IST
Us elections effect in guntur

అన్ని దేశాల చూపు ఇప్పుడు అగ్రరాజ్యం వైపే ఉంది. క్షణ క్షణానికి మారుతున్న సమీకరణాలు, ట్రంప్ కంటే హిల్లరీ కాస్తంత ముందంజలోనే ఉండటం, మూడు రోజులు మాత్రమే ఉండటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించే ఎక్కడ చూసినా డిస్కషన్. ఈ మెయిల్స్ తో హిల్లరీ, ఫీమేల్స్ తో ట్రంప్ విమర్శలు దొందు దొందే కాగా, ఎవరు గెలుస్తారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలతో నవంబరు 8న జరగనున్న ఎన్నికలపై గుంటూరు వాసుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం ఈ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అక్కడ స్థిరపడినవారు ఉండటమే. యూఎస్ లో వివిధ ప్రాంతాల్లో వ్యాపార, ఉద్యోగ రంగాల్లో స్థిరపడటమే కాదు, ఏకంగా ఎన్నికల బరిలో ఉండడం ఉత్కంఠకు మరో కారణం. అంతేకాదు ‘తానా’లో కీలక బాధ్యతలు పోషిస్తున్న గుంటూరు ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ అధ్యాపకుడు కొల్లా సుబ్బారావు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

దీంతో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించేది ఎవరన్న దానిపై గుంటూరు వాసుల మధ్య చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పూర్తి అప్‌డేట్‌లో ఉంటున్నారు. అమెరికాలో ఉంటున్న తమ బంధువులకు ఫోన్ చేసి మరీ తాజా పరిస్థితిని తెలుసుకుంటుండడం గమనార్హం. అయితే అమెరికాలోని ప్రవాస భారతీయులు మాత్రం హిల్లరీవైపే మొగ్గు చూపుతుండటం విశేషం.

ప్రాంతీయ భావాన్ని ట్రంప్ రెచ్చగొడుతున్నారని, హిల్లరీకి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టిస్తారు. ట్రంప్ గెలిస్తే పదేళ్ల తర్వాత అధికార మార్పిడి సంప్రదాయం కొనసాగుతుంది. అంతేకాకుండా గతంలో ఎటువంటి పదవులు నిర్వహించకుండా నేరుగా అధ్యక్ష పీఠం ఎక్కిన తొలివ్యక్తిగా ట్రంప్ రికార్డు సృష్టించిన వ్యక్తిగా నిలుస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US presidential elections  Donald Trump  Hillary Clinton  NRI supports  

Other Articles