దేశంలో అత్యాచారం అనే పదం వినిపించకుండా ఏరోజు లేకుండా పోతుంది. ఏదో ఒక మూల మృగాలు చేసే దాష్టీకానికి అబలలు బలైపోతూనే ఉన్నారు. వావీ-వరుసలు, చిన్నా-పెద్ద తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ జీవితాలను చిదిమేస్తున్నారు. అయితే మధ్య మధ్యలో కొందరు పోలీసులు కూడా పాడుపనులకు పాల్పడి ఖాకీ చొక్కా ప్రతిష్ఠను దిగజార్చిన ఉదంతాలు చూశాం. రక్షణ కల్పించాల్సిన వాళ్లే ఇలా చేయటంపై విమర్శలు వినిపించాయి. ఆఖరికి ఆడాళ్లకు ఎక్కాడా రక్షణా లేదని, అందులో ఆడ పోలీసులకు కూడా మినహాయింపు లేదని అని తాజా ఉదంతం నిరూపించింది.
తమిళనాడులోని మధురజంక్షన్ లో ఓ మహిళా కానిస్టేబుల్ పై తోటి కానిస్టేబులే అత్యాచారానికి పాల్పడ్డాడు. సత్యేంద్ర సింగ్ అనే కానిస్టేబుల్ పానీయంలో మత్తుమందు కలిపి ఆ దారుణం చేశాడు. ఆపై మత్తువీడిన అనంతరం ఆమె అత్యాచారానికి గురైనట్టు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సత్యేంద్ర సింగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
మరో ఉదంతంలో ఉత్తరప్రదేశ్ లోని గ్వాలియర్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న యువతిపై లైంగిక దాడి జరిగింది. ఒంటరిగా ఇంటికి వెళ్తున్న ఆ యువతిని నరేంద్ర అనే వ్యక్తి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఆమెను ఎత్తుకెళ్లేందుకు నరేంద్రకు మరో వ్యక్తి సహకరించాడు. ఆ ఇద్దరు మోటర్ బైక్ పై యువతిని మధురలోని కృష్ణానగర్ ప్రాంతంలోని ఓ పాడు బడ్డ భవంతిలో రేప్ చేశాడు. ఆమె ఫిర్యాదుతో గ్వాలియర్ పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి ఘటనల్లో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటాం. అలాంటిది ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వేర్వేరు చోట్ల అత్యాచారానికి గురికావడం కలకలం రేపుతూ... మహిళల భద్రతను ప్రశ్నిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more