దేశంలో నకిలీ కరెన్సీ అధికం.. అసాంఘిక కార్యకలాపాలను అదే శాసిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ 1000 కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటిస్థానంలో రూ. 500, రూ. రెండువేల నోట్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొ్త్తగా వచ్చిన కరెన్సీ నోట్లపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం రూ. 2000 కరెన్సీ నోటుపై చిత్ర, విచిత్ర సందేశాలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెండు వేల రూపాయల నోటుపై నానో జీపీఎస్ చిప్ వుందని, ఈ నోట్లు ఎవరు పెద్ద మెత్తంలో దాచినా అవి ఎక్కడ ఉన్నాయో అదాయపన్ను శాఖ అవలీలగా కనుక్కోగలదని పుకార్లు షాకార్లు చేశాయి. అందులోనూ ఈ చిప్ చాలా శక్తివంతమైనదని, భూమిలో 500 అడుగుల లోతులో ఈ నోట్లను పాతిపెట్టినా.. వీటిని రాడర్ నిఘా నుంచి తప్పించలేరని, నానో చిప్ ఆధారంగా వచ్చే సిగ్నళ్లతో వీటిని ఐటీ అధికారులు ట్రాక్ చేసే వీలు ఉంటుందని వదంతులు భారీగా వచ్చాయి. అవి ఏకంగా శాటిలైట్ ట్రాకింగ్ పరిధిలోకి వస్తాయని కూడా వదంతులు వ్యాపించాయి.
ఈ విషయంలో విపక్షాలు క్లారిటీ కోరడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేంధ్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్టీ, అర్థిక శాఖ అధికారులతో కలసి ఏర్పాటు చేసిన సమావేశంలో స్పష్టత వెలువరించారు. రెండు వేల కరెన్సీ నోటులో నానో జీపీఎస్ చిప్ పొందుపర్చారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు ఈ వదంతులు ఎలా వ్యాపించాయో కూడా తనకు తెలియడం లేదని చెప్పారు. ప్రధాని సమావేశం ముగిసి ముగియగానే.. మీడియా కూడా ఈ వదంతులను నిజమని బాహాటంగా ప్రచారం చేసింది.
దీంతో రూ.2000 కరెన్సీ నోటుపై ప్రభుత్వం లేదా అర్బీఐ క్లారీటీ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నోటుపై అందోళన కూడా వ్యక్తమయ్యింది. ప్రభుత్వమే కాకుండా ఈ చిప్ సాంకేతికను ట్రేస్ చేసే దోపిడీలకు పాల్పడే ప్రమాదముందన్న ఉన్నతవర్గాలు, పారిశ్రామిక వేత్తల నుంచి పెద్ద ఎత్తున అందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఆర్బీఐ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చింది. ఈ వదంతులన్నీ కొందరి పనేనని, అవి ఉత్తుత్త వదంతులని స్పష్టతనిచ్చింది. రూ. 2000 నోటుకు సంబంధించిన ఆర్బీఐ ఇచ్చిన వివరణలో ఎక్కడా కూడా నానో చిప్ ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంతేకాకుండా నోటులో చిప్ ఉంటుందని వస్తున్న వదంతులను కూడా ఆర్బీఐ తోసిపుచ్చింది. రూ. 2వేల నోట్లలో అలాంటివేమీ ఉండవని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more