మోదీ టైమింగ్ ఎంత పని చేసిందో తెలుసా? | Reason behind Modi Currency cancellation announcement

Reason behind modi currency cancellation announcement

Arthkranti Activist Anil Bokil, PM Narendra Modi Anil Bokil, Anil Bokil Idea, Modi new currency idea, Man behind New Currency

Why PM Modi Currency Cancellation announcement at night time only. Anil Bokil The Real person behind Modi's Black Money Surgical strikes.

మోదీ టైమింగ్ ఎంత పని చేసిందయ్యా...

Posted: 11/10/2016 10:10 AM IST
Reason behind modi currency cancellation announcement

హఠాత్తుగా ప్రకటించిన నిర్ణయమే అయినప్పటికీ, ఆరు నెలల ముందుగానే ఆర్థిక వేత్తలతో చేసిన సంప్రదింపుల తర్వాతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దుపై ఓ స్పష్టమైన ప్రకటన చేశాడు. అయితే ఈ నిర్ణయంపై హర్షాలు, పెదవి విరుపులు ఎన్ని ఉన్నప్పటికీ ఖజానాను కాపాడే ప్రయత్నమే అని చెప్పుకోవాలి. నల్ల ధనం బండారం బయటపడటమే కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన నోట్లను ఎంత ప్రయత్నించినా నకిలీవి తయారు చేయటం సాధ్యం కాదని ఇంటలిజెన్స్ వర్గాలు కూడా చెబుతుండటం మంచి పరిణామమే.

అయితే ప్రకటన పగలే చేసి ఉండొచ్చన్న అనుమానం ఎవరికైనా వచ్చి ఉండొచ్చు. మంగళవారం ఉదయం నుంచి అద్వానీని కలవటం, ఆపై భద్రతా దళాలతో సమావేశం అయి ఆపై తీరిగ్గా రాత్రి 8 గంటల సమయంలోనే ఎందుకీ ప్రకటన చేశారన్న దానికి ఓ బలమైన కారణం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.

సాధారణంగా కొన్ని బ్యాంకులు మినహా దాదాపు అన్ని బ్యాంకుల్లో సాయంత్రం ఐదు గంటలకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఆ తర్వాత ఆయా బ్యాంకుల్లో వెయ్యి, ఐదు వందల నోట్లు ఎన్ని ఉన్నాయో చెక్‌లిస్ట్ ఆర్బీఐకి అందుతుంది. దీంతో మొత్తం క్యాష్ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అంటే ఈ మొత్తం సమాచారం అందే వరకు మోదీ ఆగారన్నమాట. పెద్ద నోట్లు రద్దు చేశారని తెలియగానే బడా బాబులు తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లను ఆశ్రయించి తమ వద్ద ఉన్న నల్ల డబ్బును రాత్రికి రాత్రే బ్యాంకుకు తరలించి రూ.వంద, రూ.యాభై నోట్లుగా మార్చేసుకుంటారు. ఇలా దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు తెల్ల డబ్బుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతుంది.

అందుకే పూర్తి సమాచారం అందాకే మోదీ ముందడుగు వేయటంతో, చివరి నిమిషంలో కోట్లాది రూపాయలు వైట్ మనీగా మారకుండా పోయింది. అంతేకాదు నల్లడబ్బును తెల్లగా మార్చుకునేందుకు కొందరు బంగారంపై దృష్టి సారిస్తారు. షేర్ మార్కెట్లలోనూ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అందుకే అవి కూడా మూసేసిన తర్వాత మోదీ ప్రకటన వెలువడింది. మరో విషయం ఏమిటంటే, సట్టా బజార్‌పైనా రద్దు ప్రభావం పడింది. మరుసటి రోజు అమెరికా ఎన్నికల ఫలితాలు ఉండటం, వాటిపై కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశం ఉండటంతో కూడా ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి నుంచే ఆయా నోట్లకు విలువ లేకుండా చేయటం, ఆపై రాత్రి ఒంటిగంట తర్వాత ఫలితాలు రావడం ప్రారంభం కావటంతో కరెన్సీకి విలువ లేకుండా చేసి కోట్ల రూపాయలు చేతులు మారకుండా ఆపారన్న మాట.


ఐడియా వెనుక అసలు వ్యక్తి:

పెద్ద నోట్లు మార్చాలన్న నిర్ణయం కాసేటి క్రితం నుంచి అమలులోకి వచ్చింది. జనాలంతా నోట్లతో బ్యాంకుల ముందు బారులు తీరారు. ఇంతకాలం విలువగా ఉన్న అవి కాస్త కాసేట్లో చిత్తు కాగితాలుగా మారబోతున్నాయన్న బాధ ఓవైపు, మరోవైపు కొత్త నోట్లు వస్తున్నాయన్న సంతోషం. అయితే అంతా ఈ నిర్ణయం వెనుక మోదీ ఒక్కడే ఉన్నాడని అనుకుంటున్నారు. కానీ, పలువురు ఆర్థికవేత్తలతో సమావేశమైన అయి ఆరునెలల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఇక మోదీ నిర్ణయం వెనక ఓ వ్యక్తి సూచన ఉందని తెలుస్తోంది. 9 నిమిషాలు మాట్లాడి మొత్తం నల్లధనంపై తీవ్ర ప్రభావం చూపించారు. అతనే పుణెకు చెందిన ఆర్థిక నిపుణుడు అనిల్ బోకిల్(ఆర్థక్రాంతి) నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లు రద్దు చేయాలని సూచించారు. ఈ నోట్ల రద్దుతో నల్లధనం మొత్తం నిర్మూలించవచ్చని కారణాలతోసహా ఈ అర్థక్రాంతి సంస్థాన్ కీలకసభ్యుడు వివరించాడు.

1. భారతదేశంలో రోజులో సగటుగా రూ. 2.7కోట్ల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అదే ఏడాదిలో రూ. 800 లక్షల కోట్లు. కానీ, 20శాతం కార్యకలాపాలు మాత్రమే బ్యాంకుల ద్వారా జరుగుతున్నాయి. మిగితా కార్యకలాపాన్నీ నగదు ద్వారానే సాగుతున్నాయి. దీంతో లెక్క తేలడం లేదు.

2. దేశంలో 78శాతం మంది ప్రజలు రోజుకు రూ. 20మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అందువల్ల వారికి పెద్ద నోట్లతో పెద్దగా అవసరం ఉండదు.

Anil Bokil

 

గతంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆమెను, మరికొందరు నేతలను కలిసి దీనిపై చర్చలు జరిపారు కూడా. కానీ, లాభం లేకపోయింది. ఇక కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీని అనిల్ కలిశారు. ఈ సందర్భంగా నల్లధనాన్ని అరికట్టేందుకు పలు ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన సూచనలు చేశారు. ప్రధాని ఇచ్చిన 9నిమిషాల సమయంలోనే ఆయన పూర్తిగా నల్లధనం ప్రవాహం, అరికట్టే చర్యలను ప్రధానికి వివరించారు. ఆ తర్వాత అతని సూచనలపై ప్రధాని మోడీ దాదాపు రెండు గంటలపాటు చర్చించాడు. అంతే దానిపై సమాలోచనలు చేసిన మోదీ టైం వేస్ట్ చేయకుండా ఆచరణలో పెట్టేశాడు.

1. దిగుమతి సుంకం మినహా, 56 విభిన్న పన్నుల వసూళ్లను నిలిపేయాలి
2. పెద్ద నోట్లు రూ. 1000, 500, 100 నోట్లను కూడా రద్దు చేయాలి.
3. అన్ని కార్యకలాపాలు బ్యాంక్(చెక్కు, డిమాండ్ డ్రాఫ్ట్, ఆన్‌లైన్ ) ద్వారానే జరగాలి.
4. రెవెన్యూ కలెక్షన్ కోసం సింగిల్ బ్యాంకింగ్ సిస్టమ్.

ఈ మహా ఆర్థిక నిపుణుడి సలహాతో దేశం కరెన్సీ కల్లోలమే ఏర్పడినప్పటికీ, దేశంలోని నల్లధనం బయటికి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో నకిలీ నోట్లకు ఈ నిర్ణయం శరాఘాతమనే చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  New Currency Announcement  Anil Bokil  Arthkranti Activist  

Other Articles