తెలంగాణ గ్రూప్-2 లో కబాలి, ధోనీ ప్రశ్నలు... | Kabali Dhoni questions in TSPSC Group 2 exam

Kabali dhoni questions in tspsc group 2 exam

Kabali, MS Dhoni, Kabali and Dhoni, Telanagana Group 2 Exam, TSPSC Exam, Dhoni and kabali, Kabali and dhoni questions, Movie questions in Telangana Group 2, Kabali Dhoni Questions, rajnikanth Kabali

Three Movie related questions in Telangana Public Service Commission Exam.

గ్రూప్-2 లో కబాలి, ధోనీ క్వశ్చన్స్

Posted: 11/12/2016 08:40 AM IST
Kabali dhoni questions in tspsc group 2 exam

ఈ మధ్య ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ కన్నా సినిమా పరిజ్నానంకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ తారసపడుతున్నాయి. ఆ మధ్య ఢిపెన్స్ ఎగ్జామ్ పేపర్ లో దీపికా పదుకునే గురించి, ఆపై కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ ఎవరంటూ ఓ పరీక్షలో, ఈ మధ్య కేరళలో అయితే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎగ్జామ్ లో సన్నీలియోన్ గురించి క్వశ్చన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలో కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. శుక్రవారం జరిగిన గ్రూప్-2 పరీక్షలో ‘కబాలి’, ‘ధోనీ’ చిత్రాలపై ప్రశ్నలు వచ్చాయి. ‘మై ఫాదర్ బాలయ్య’ అనే పుస్తకానికి, తెలంగాణతో ఉన్న సంబంధం ఏంటన్న ప్రశ్న ఒకటి అడిగారు. అయితే ఆ పుస్తకం పుట్టుపూర్వోత్తరాలు హీరో రజనీకాంత్ నటించిన కబాలి సమయంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇంట్రడక్షన్ సీన్ లో రజనీ చదువుతూ కనిపించే ఈ పుస్తకం గురించి అప్పుడు బాగా చర్చ జరిగింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామవాసి వైబీ సత్యనారాయణ (ఎల్కటి బాలయ్య సత్యనారాయణ) ఈ పుస్తకం రచించారు.

ఓ దళిత కుటుంబంలో పుట్టిన సత్యనారాయణ తల్లిదండ్రులు బాలయ్య, నర్సమ్మ. తన తండ్రి గురించి సత్యనారాయణ రాసిందే ఈ పుస్తకం. 2013లో తెలుగులో, 2014లో కన్నడ, 2015లో హిందీ భాషల్లోకి పుస్తకం అనువాదం కాగా, ఈ మధ్యే తమిళ్, బెంగాలీ, మరాఠీలోకి తర్జుమా చేసేశారు. కాగా, మరోప్రశ్నగా టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్ర దర్శకుడు ఎవరంటూ ఈ పరీక్షలో అడిగారు. దానికి సమాధానం నీరజ్ పాండే. 

మూడో ప్ర‌శ్న‌గా త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ కోలీవుడ్ గా పాపుల‌ర్. మ‌ల‌యాళం సినీ ప‌రిశ్ర‌మ మ‌ల్లువుడ్ గా పాపుల‌ర్. బెంగాళి ఇండ‌స్ట్రీ ఏ పేరుతో పాపుల‌ర్ అని అడిగారు. తెలుగు సినిమా రంగం నుంచే రిఫరెన్స్ తీసుకోవటంతో దానిని కూడా టాలీవుడ్ అనే పిలుస్తారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Public service Commission  Group-2 Exam  Kabali Dhoni Questions  

Other Articles