లవర్ ప్లేస్ లో పామును ఊహించుకుంటూ అతగాడు... | man marries snake he believes is his dead girlfriend

Man marries pet snake he believes is his dead girlfriend

Worranan Sarasalin, Thailand man Marriage Snake, Snake marriage, Man Snake relation, Man Marriage Snake, Snake relation with man, Man Snake love, Man Snake Honeymoon, Heartbreaking lover with snake, Great Snake love

Thailand Man Allegedly Lives with Snake He Thinks Is His Dead Girlfriend.

పాములో లవర్ ని చూసుకుంటూ అతగాడు...

Posted: 11/12/2016 10:36 AM IST
Man marries pet snake he believes is his dead girlfriend

ప్రేమ అంటే ప్రే అంటే ప్రేమించటం.. మ అంటే మరిచిపోవటం కాదు. అవతలి వారు దక్కినా.. దక్కకపోయినా మధురమైన ఆ అనుభూతిని ఆస్వాదించటం. అలాగని అంధకారంలో మునిగిపోయి అక్కడే ఆగిపోకూడదు కదా. అందుకే మరో తోడు వెతుక్కోవాల్సిందే. ఇక్కడ థాయ్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేస్తున్నాడు. అయితే ఆ తోడు మనిషి కాకపోవటమే ఇక్కడ అసలు ట్విస్ట్.

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి థాయ్ లాండ్ కంచానాబురి ప్రాంతానికి చెందిన వొర్రానన్ సారాసాలిన్. పాములు పట్టేవాడు అనుకుంటే పొరపాటు. అది అతని అర్థాంగి.. అదేనండీ భార్య. కొన్నేళ్ల క్రితం అతను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. అప్పటి నుంచి విషాదంలో కూరుకుపోయిన ఇతగాడికి ఈ తాచుపాము కనిపించింది. తన ప్రేయసి పునర్జమ్మ ఎత్తి పాముగా పుట్టిందని గట్టిగా నమ్మాడు.

అంతే ఆ పామును ప్రేమించటం మొదలుపెట్టాడు. షికార్లు, సినిమాలు ఇలా ఎక్కడికి పడితే అక్కడికి ఆ పాముతో ప్రయాణించేవాడు. చూసినవాళ్లంతా పిచ్చోడు అనుకున్నారు. మరికొందరు బయపడిపోయారు. అతను మాత్రం వణకలేదు. ఇలా కాదని ఆ పామును పెళ్లి చేసుకుని ఇప్పుడు హాయిగా కాపురం చేస్తున్నాడు. అంతేనా సింగపూర్ కి హనీమూన్ కి కూడా వెళ్లాడు. జంతువు ఎంతైనా జంతువే కదా.. ఎప్పటికైనా ప్రమాదమని కొందరు వారించారు.

Thai man living snake

ఈ మాట అంటే అతగాడు ఏమంటున్నాడో తెలుసా? ఆ విషయం నాకు తెలుసు. నేను ఒక పాముతో సావాసం చేస్తున్న కానీ... నా నమ్మకం నాది. ప్రాణాలు పోతాయన్న భయం నాకు లేదు. చివరి వరకు నా తోడు అదే అని ఈ పిచ్చి ప్రేమికుడు.

thai man with cobra

 

Thai Man with Snake

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thailand Man  Died Girlfriend  Snake  Marriage  

Other Articles