ఆ ఫోటో బ్యాంకుల దగ్గర కాదు.. అసలు ఇండియాదే కాదంట ! | Congress leader shares Kenya election pic

Sanjay jha shares 2013 kenya election pic

Cong leader Sanjay Jha, 2013 Kenya election pic, Sanjay Jha, Sanjay Jha Kenya Photo,

Cong leader Sanjay Jha shares 2013 Kenya election pic to show 'long bank queues'.

మోదీని ఆ ఫోటోతో ఇరికిద్దామని చూశాడు

Posted: 11/14/2016 12:48 PM IST
Sanjay jha shares 2013 kenya election pic

అవకాశం దొరికినప్పుడల్లా అధికార బీజేపీ ను బుక్ చేద్దామన్నదే ప్రతిపక్ష కాంగ్రెస్ టార్గెట్ గా మారిపోయింది. ప్రస్తుతం దేశానికి కుదిపేస్తున్న నోట్ల వ్యవహారంపై కూడా అల్రెడీ పోరాటం ప్రారంభించేసింది కూడా. ఈ క్రమంలో గల్లీ నేతల దగ్గరి నుంచి ఢిల్లీ నేతల దాకా అంతా మోదీ అండ్ కో పై విరుచుకుపడుతున్నారు.

మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేతలు కూడా సందేశాలతో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్న జనాల ఫోటోలను షేర్ చేసేస్తున్నారు. అయితే అది నిజమో అబద్ధమో తెలీకుండానే వారు పొరపాట్లకు పాల్పడిపోతున్నారు. కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ ఒకరు ఇప్పుడు అలాగే చేసి విమర్శలు ఎదుర్కుంటున్నాడు.

చాందినీ చౌక్ కాంగ్రెస్ నేత నసీం అహ్మద్ తన ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ క్యూకి మోదీ కారణం అంటూ అందులో పేర్కొన్నాడు. జనాలను ఇంతలా ఇబ్బందిపెట్టి ఆయన సాధించేది ఏం ఉండదూ అంటూ సందేశంలో పేర్కొన్నాడు. ఫోటో బాగా వైరల్ అయ్యింది. జాతీయ మీడియాలు దానిపై కార్డూన్లు కూడా వేశాయి. కానీ, అక్కడే నసీం పప్పులో కాలేశాడు.

మరో కాంగ్రెస్ నేత సంజయ్ ఝా కూడా నమ్మలేకపోతున్నా అంటూ ఆ ఫోటోను షేర్ చేశాడు. అయితే అది 2013 కెన్యా ఎన్నికలకు సంబంధించిన ఫోటో అంటూ ఆధారాలతోసహా నిరూపించగా, కాంగ్రెస్ నేతలకు కెన్యాకు, ఇండియాకు కూడా తేడా తేలీదా? అంటూ సెటైర్లు పడుతున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles