అవినీతి, నకిలీ నోట్లను దేశం నుంచి పారద్రోలేందుకు కేంద్రం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో.. బ్యాంకులు, ఏటీయంల వద్ద క్యూ కడుతున్న సామాన్యులకు.. అర్థిక కష్టాలు ఇప్పడప్పుడే తీరేలా లేవు. సామాన్య ప్రజలు మాత్రం నానా ఇక్కట్లు పడుతున్నారు. పనులు మానుకుని మరీ, పచ్చ నోటు కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చుంటున్న వారికి డబ్బు వచ్చే అదృష్టం వుందో లేదో నోట్లు చేతిలో పడే వరకు అర్థంకావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర అర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగి ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకోగలమని, అయితే మరో రెండు వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.
కాగా బ్యాంకు యాజమాన్యాల వాదన మాత్రం పూర్తిగా భిన్నంగా వుంది. రెండు వారాల్లో పరిస్థితికి అదుపులోకి తేవడం కష్టమని, మరో ఆరు వారాలు పట్టే అవకాశముందని చావు కబురు చల్లగా చెప్పాయి. కొత్త నోట్లు ప్రవేశపెడుతున్నందు వల్ల ఏటీఎంల్లో సరికొత్త టెక్నాలజీని వినియోగించాల్సి వస్తోందని, అందుకే ఇంత ఎక్కువ సమయం పడుతుందని బ్యాంకర్లు ప్రకటించారు. ఒక్కో ఏటీఎంను అప్‌డేట్ చేయడానికి దాదాపు 15 నిమిషాలకు పైగా సమయం పడుతోందని తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతానికి 3వేల మంది ఇంజనీర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని, మరో వెయ్యి మందికి పైగా అవసరం పడుతుందని బ్యాంకర్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షలకు పైగా ఏటీఎంల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయనున్నట్లు బ్యాంకు యాజమాన్యాలు తెలిపాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తయి, ఏటీఎంల్లో డబ్బు అందుబాటులోకి రావడానికి మరో నెల రోజులు సమయం పట్టే అవకాశముందని బ్యాంకులు ప్రకటించాయి. దీంతో ఇప్పటికే కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం పూజలతో పాటు వివాహాలపై ప్రభావం చూపుతుండగా, అటు క్రైస్తవుల క్రిస్మస్ పండగతో పాటు నూతన సంవత్సరం వేడుకలపై కూడా ప్రభావం చూపనుందని తెలిపింది. ఇక రాష్ట్రాలు కూడా అదాయాన్ని కోల్పోవల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more