నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై ఎవరి యాంగిల్ లో వారు మాట్లాడుకున్నప్పటికీ, అది ఖచ్చితంగా దేశానికి మేలు చేసే అంశం అన్నది ఆర్థిక నిపుణుల వాదన. ఈ హఠాత్ నిర్ణయంతో మరికొన్నాళ్లపాటు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చూట్టూ తిరగాల్సిన తిప్పలు మాత్రం తప్పేలా లేవు. కానీ, ఎలాగోలా కొత్త నోట్లను చిక్కించుకున్న వారికి ఇప్పడు షాకిచ్చేలా ఫేక్ కరెన్సీ మార్కెట్లోకి వచ్చేసింది.
అలాగని వారేం నోట్లను ప్రింట్ చేయటం లేదు. జనాల్లో చాలా వరకు ఇంకా రెండు వేల నోటు పూర్తి స్థాయిలో చేరకపోవటంతో వాటిని కలర్ జిరాక్స్ తీసేసి ఏమారుస్తున్నారు కొన్ని ముఠా సభ్యులు. ఒడిషాలోని ఓ పెట్రోల్ బంక్ లో ఇలా ఓ నోటును మార్చే క్రమంలో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో ఘటనలో దందన్ సర్దార్ అనే ఓ వ్యక్తి ఇంటిపై ఫేక్ కరెన్సీ సమాచారంతో దాడి నిర్వహించిన పోలీసులు 12.75 లక్షల అసలు నగదును సీజ్ చేశారు. ఇందులో4.8 లక్షల రెండువేల నోట్లు ఉండటం విశేషం. ఓ పక్క బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద జనాలు ఈ నోట్ల కోసం ఎగబడిపోతుంటే, బ్యాగు నిండా అతనికి సిసలైన 2000 నోట్లు ఎలా వచ్చాయోనని ఆరాతీశారు. బహుశా స్థానికుల సాయంతో ఇంత పెద్ద మొత్తంలో అతను కరెన్సీ చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరో పక్క ఖమ్మం, మహబూబా బాద్, కర్ణాటకలోని చిక్ మంగళూర్ లో కూడా ఇదే రీతిలో జిరాక్స్ కరెన్సీతో మార్చేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు.
మరోపక్క ప్రభుత్వం ప్రింట్ చేసిన 2 వేలు, 500 నోట్ల ముద్రణలో కూడా తేడాలు ఉండటంతో జనాల్లో ఆందోళన నెలకొంది. ఒక నోటుకి మరో నోటుకి సంబంధం లేకుండా ప్రింట్ చేయటం, ముద్రణలో సగం సగం అక్షరాలు రావటం, వెరసి అఫీషియల్ నోట్లలోనే ఇన్ని తప్పులు ఉండటంతో ఏం చేయాలో పాలుపోనీ పరిస్థితి దాపురించింది. ఈ లెక్కన ఇంతకాలం చిల్లర సమస్యలు ఎదుర్కున్న ప్రజలు ఇకపై ఆ పెద్ద నోట్లను మార్చేందుకు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందేమో.
అసలు గుర్తించటం ఎలాగంటే...
- 2000 అని అంకెల్లో రాసిన దానికింద రిజిస్టర్ నంబర్ ఉంటుంది.
- 2000 ఇమేజ్ కాస్త గుప్తంగా తరచిచూస్తే కనిపించేవిధంగా ఉంటుంది.
- దేవనాగరి అంకెలలో २००० అని రాసి ఉంటుంది.
- నోటు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది.
- బ్యాంకు నోటు ఎడుమవైపు ‘ఆర్బీఐ’ అని, ‘2000’ అని సూక్ష్మంగా రాసి ఉంటుంది.
- ‘భారత్’ అని విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్‌లో రాసి ఉంటుంది. అంతేకాకుండా ఆర్బీఐ, 2000 అని కలర్‌షిఫ్ట్‌లో రాసి ఉంటాయి. నోటును కాస్తా కదిలిస్తే ఇవి ఆకుపచ్చని రంగు నుంచి నీలిరంగులో మారుతాయి.
- నోటు కుడివైపున గ్యాంరెటీ క్లాజ్, గవర్నర్ సంతకం, ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ చిహ్నం ఉంటాయి.
- కుడివైపున కిందిభాగంలో రూపీ ముద్ర, ₹2000 అని కలర్ చేజింగ్ (ఆకుపచ్చ రంగు నుంచి నీలిరంగులోకి మారుతాయి)లో రాసి ఉంటాయి.
- మహాత్మాగాంధీ బొమ్మకు కుడివైపున అశోక స్తంభం చిహ్నంతోపాటు, ఎలక్ట్రోటైప్ (2000 అని) వాటర్ మార్క్స్ ఉంటాయి.
- ఎడుమవైపున పైభాగంలో, కుడివైపున కిందిభాగంలో సిరీస్ అంకెలు చిన్నవి నుంచి పెద్దవిగా ఉంటాయి.
వెనుక భాగంలో...
- ఎడుమవైపు ముద్రణ సంవత్సరం ముద్రించి ఉంటుంది
- నినాదంతో కూడిన స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది.
- కుడివైపునకు చేరువగా భాషల ప్యానెల్ ఉంటుంది.
- శాటిలైట్ తో మంగళ్ యాన్ బొమ్మ ఉంటుంది.
- దేవనాగరి అంకెలలో २००० అని రాసి ఉంటుంది.
- రూ. రెండువేల నోటు 66 మిల్లిమీటర్ల వెడల్పు, 166 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది.
- కళ్లు కనిపించని వారు గుర్తించేందుకు మహాత్మా గాంధీ బొమ్మ, అశోక స్తంభం చిహ్నం ఉబ్బెత్తుగా ఉండి, బ్లీడ్ లైన్స్, ఐడెంటిటీ మార్క్స్ ఉంటాయి.
- సమాంతరంగా, దీర్ఘచతురస్రాకారంలో ₹2000 ఉబ్బెత్తుగా నోటుపై రాసి ఉంటుంది.
- నోటు కుడివైపున, ఎడుమవైపున కోణాకారంలో బ్లీడ్‌లైన్స్ ఉబ్బెత్తుగా ఉంటాయి.
ఇక రూ. 500 నోటుపై ఏమి ఉంటాయంటే..
- మహాత్మాగాంధీ సిరీస్‌లో విడుదల చేసిన కొత్త రూ. 500 నోట్లపై ‘E’ అనే ఇంగ్లిష్ అక్షరంతోపాటు ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, ముద్రణ సంవత్సరం ‘2016’, స్వచ్ఛ భారత్ లోగో, నోటు
వెనుకవైపున ముద్రించి ఉంటాయి.
- గతంలో జారీచేసిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల (ఎస్బీఎన్) సిరీస్‌కు రంగులో, పరిణామంలో, డిజైన్‌లో, థీమ్‌లో, భద్రతపరమైన ఫీచర్స్ విషయంలో కొత్త 500 నోటు భిన్నంగా ఉంటుంది.
- ఈ నోటు వెడల్పు 66మిల్లీమీటర్లు, పొడవు 150 మిల్లీమీటర్లు
- రంగు స్టోన్ గ్రే (నెరిసిన ముదురు రంగు)
- భారత వారసత్వ సందప అయిన జాతీయ పతాకంతో కూడిన ఎర్రకోట బొమ్మ నోటు వెనుకవైపు ముద్రించి ఉంటాయి.
- అంధుల కోసం మహాత్మాగాంధీ బొమ్మ, అశోక చిహ్నం, బ్లీడ్ లైన్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉబ్బెత్తుగా ముద్రించి ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more