బాధ్యతతో కూడిన పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ సమాజం మొత్తం ఉమ్మెసే పనులు చేస్తున్నారు కొందరు. కొన్ని నెలల క్రితం చెన్నైలో ఓ మెడికో స్టూడెంట్ ఓ బిల్డింగ్ మీద నుంచి ఓ కుక్కను నిర్ధాక్షిణ్యంగా విసిరిపారేటయం, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి పైశాచిక ఆనందం పొందటం, జంతు ప్రేమికుల జోక్యం ఆ దుర్మార్గులకు శిక్ష పడటం చూశాం. ఇప్పుడు అంతకన్నా దారుణమైన ఘటనే బయటపడింది.
రాక్షస క్రీడతో పాపం ఓ కోతి పిల్లను కిరాతకంగా హింసించి మరీ బలి తీసుకున్నారు ఓ ముగ్గురు మెడికోలు. వెల్లూరుకి వంద కిలోమీటర్ల దూరంలోని క్రిస్టియానా మెడికల్ కాలేజీలో ఈ దారుణం బయటపడింది. ఓ మూగజీవాన్ని మాటల్లో కూడా చెప్పుకోలేని రీతిలో చంపేసి, దానిని ఖననం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తతంగం అంతా వీడియో పుటేజ్ రూపంలో బయటికి రావటంతో జంతు హక్కు పరిరక్షలు రోడెక్కి ఆందోళనకు దిగారు.
ఓ ముగ్గురు స్టూడెంట్లు బ్లాంకెట్ వేసి మరీ ఓ కోతి పిల్లను బంధించారు. ఆపై దాని చేతులు వెనక్కి కట్టేసి, టెలిఫోన్ వైర్ తో మెడకు ఉరేసి, బెల్ట్ తో కొడుతూ చంపేశారు. ఆ బాధతో అది విలవిలలాడుతుంటే ఆనందం పొందారని వీడియోను పోలీసులకు అప్పజెప్పిన జంతు సంరక్షణ బోర్డు సభ్యుడోకరు తెలిపారు. చివరికి దాని మర్మాంగంలోకి పదునైన ఆయుధాలను చొప్పించి హింసించారని ఆయన తెలిపాడు. శవాన్ని బయటికి తీసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపించారు.
ఘటనపై స్పందించిన కాలేజీ యాజమాన్యం ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. అయితే వారిలో ఇంతవరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవటం విశేషం. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, పూర్తి విచారణ తర్వాత అరెస్ట్ లు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. మానవత్వం లేకుండా జరిగిన ఈ రాక్షస క్రీడపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. మనిషి ప్రాణం ఒక్కటే ఈ భూమ్మీద విలువైంది కాదు కదా!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more