ప్రధాని మోడీకి యువీ వెడ్డింగ్ ఇన్విటేషన్.. పేరులో అక్షరదోషం Yuvraj meets PM Modi, invites him for Marriage

Yuvraj singh meets pm narendra modi extends wedding invitation

yuvraj singh, yuvraj, prime minister narendra modi, pm modi, yuvraj singh modi, yuvraj singh wedding, yuvraj singh wedding invitiation, yuvraj singh hazel keech, yuvraj hazel wedding, cricket news, sports news

Cricketer Yuvraj Singh arrived at Parliament in the capital to meet with Prime Minister Narendra Modi to extend an invitation for his marriage

ప్రధాని మోడీకి యువీ వెడ్డింగ్ ఇన్విటేషన్.. పేరులో అక్షరదోషం

Posted: 11/24/2016 08:00 PM IST
Yuvraj singh meets pm narendra modi extends wedding invitation

భారత్ జట్టు రెండో పర్యాయం ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంలో ముఖ్యభూమిక పోషించిన టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ మరో వారంలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి తన అహ్వాన పత్రికను అందించి.. తన వివాహవేడుకకు అహ్వానించేందుకని పార్లమెంటు వద్దకు చేరుకున్నాడు.  అటుగా వెళుతున్న యువీని ఆయన చేతిలోని పెళ్లి కార్డును చూసిన విలేకర్లు వెంటనే తమ చేతుల్లోని కెమెరాలకు పని చెప్పారు.

ఆ తరువాత యువరాజ్ ఓ చిన్న పోరబాటు చేశాడని గుర్తించారు. ప్రధానిని అహ్వానించేందుకని రాసిన ఓ అహ్వాన పత్రికలో ప్రధాని నరేంద్ర మోడీ పేరును తప్పుగా ఉన్నట్లు గుర్తించారు.ప్రధాని నరేంద్ర మోదీ పేరును పెళ్లి ఆహ్వాన పత్రికపై తప్పుగా ప్రచురించడాన్ని గుర్తించారు. ప్రధాని నరేంద్రమోదీ అని కాకుండా ప్రధాని (నరేందర్‌ మోదీ) అంటూ అక్షర దోశంతో ఉన్న ఆహ్వాన పత్రికపైన లిఖించారు.

అయితే, వీరేందర్‌ సెహ్వాగ్‌తో కలిసి సహవాసం చేసిన యువీపై ఆ పేరు ప్రభావం పడి వీరేందర్‌ మాదిరిగా నరేందర్‌ అని రాసి ఉంటాడేమో అని కొందరు భావిస్తున్నారు. అయినా పెళ్లంటే హడావుడి బిజీ బిజీగా ఉంటారు. ఈ వేళలో ఏ అంశంపైనా కుదురుగా ఉండలేరు.. దేని గురించి పెద్దగా పట్టించుకునే తీరిక ఉండదు. ఇలాంటి సమయాల్లోని చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజమేలే అని మన యువీ ఫ్యాన్స్‌ అంటున్నారు. హాలీవుడ్ నటి, మోడల్‌ హజల్కీచ్తో యువీ ఈ నెల 30న ఏడడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన వివాహాని దేశంలోని అగ్రనాయకులను సెలబ్రిటీలను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuvraj Singh  Hazel Keech  Wedding  Prime Minister Narendra Modi  

Other Articles