అబ్బాయిలతో తిరిగితే ఇంటికేనని విద్యార్థినులకు వార్నింగ్ NIT-Calicut warns girls against 'roaming' with boys

Nit calicut hostel warns female residents not to roam with boys

NIT-Calicut, National Institute of Technology Calicut, NIT-Calicut residential campus, NIT-Calicut ladies hostel inmates, roaming with boy students, Calicut, National Institute of Technology, News, Rules for women students, women, women rights

Calicut (NIT-C) has issued a notice to its ladies hostel inmates threatening expulsion if found "roaming with boys" inside its residential campus.

అమ్మాయిలకు అంక్షలు: అబ్బాయిలతో తిరిగితే ఇంటికేనని వార్నింగ్

Posted: 11/24/2016 08:25 PM IST
Nit calicut hostel warns female residents not to roam with boys

ఎదిగిన విద్యార్థులను అదుపాజ్ఞల్లో పెట్టాలని ప్రయత్నిస్తే జరిగే పరిణామాలే ఏంటో కూడా తెలిసి మరీ కేరళలోని కాలికట్ నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ కు చెందిన అధికారులు ఆ ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నారు. జాగ్రత్తగా వుండాలని హెచ్చరించాల్సిన సమయంలో అసలు తిరగడమే తప్పు అన్నట్లుగా హెచ్చరించే సరికి అది కాస్తా రచ్చరంబోలాకు దారితీసింది. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అలాంటి అంక్షలను విధించడం సహేతుకం కాదని తేల్చిచెప్పడంతో హాస్టల్ యాజమాన్యం వెనక్కు తగ్గింది.

వివరాల్లోకి వెళ్తే.. తమ క్యాంపస్లోని విద్యార్థినులకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ-సీ) కాలికట్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఏ అమ్మాయి కూడా అబ్బాయితో తిరుగుతూ కనిపించవొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు క్యాంపస్‌ లేడీస్‌ హాస్టల్‌ వార్డెన్‌ నోటీసులను అంటించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌ లింగ వివక్షకు గురి చేస్తున్నారంటూ ఆమె చర్యను ఖండించారు.

కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఈ నోటీసులు చూసి అవాక్కయ్యారు. ఆ నోటీసులో ఎస్‌ భువనేశ్వరీ అనే వార్డెన్‌ పేరిట చెప్పారంటే.. ’క్యాంపస్‌ లోని రెండు వసతి గృహాల ప్రాంగణాల్లో అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరుగుతున్నట్లు తెలిసింది. మాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. ఇక నుంచి ఏ అమ్మాయి అయినా అబ్బాయితో కలిసి ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిసిందో వారిపై సస్పెన్షన్‌ వేటుగానీ, హాస్టల్‌ నుంచి వెళ్లగొట్టే చర్యలుగానీ తీసుకోవడం జరుగుతుంది జాగ్రత్త’ అంటూ పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా అమ్మాయిలను మాత్రమే ఉద్దేశించి చెప్పడంపై అక్కడి వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Calicut  National Institute of Technology  News  Rules for women students  women  women rights  

Other Articles