10 నెలల శిశువును ఎత్తి కుదేసి.. కాలితో తన్నిన తాటకి creche maid arrested after thrashing toddler

Maid kicks and fractures 9 month old baby s head in kharghar day care

Navi Mumbai, day care centre, maid assaults child, maid injures child, Kharghar day care centre, Kharghar creche, shocking video, assault on child, Purva Nursery, CCTV footage

CCTV footage shows the little girl being yanked by her arm and flung down by the maid, who also slapped her repeatedly; nursery owner and employee were both arrested

ITEMVIDEOS: 10 నెలల శిశువును ఎత్తి కుదేసి.. కాలితో తన్నిన తాటకి

Posted: 11/25/2016 12:31 PM IST
Maid kicks and fractures 9 month old baby s head in kharghar day care

అడవారిలో వున్నంత సహనం, ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ అదే అమ్మలుగా మారిన తల్లులైతే.. చిన్నారుల పట్ల ఎంత ఆప్యాయత కనబరుస్తారో చెప్పనవసరం లేదు. ముద్దుగా కనబడే శిశువులు తమ వారు కాకపోయినా.. వారితో సరదాగా గడపాలని అశపడతారు. కానీ నవీ ముంబైలోని ఓ కేర్ టేకర్ కేంద్రంలో వున్న అయా మాత్రం పది నెలల శిశువుపై తాటకిలా వ్యవహరించింది. తనలోని రాక్షసత్వాన్ని కనబర్చింది. కేర్ టేకర్ కేంద్రంలో పనిచేస్తున్నామన్న ద్యాస కూడా లేకుండా అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది.

పది నెలల పసిపాపపై తన ప్రతాపాన్ని చూపుతూ గొడ్డును బాదినట్లు బాదింది. తొలిరోజు కేర్ సెంటర్ కు వచ్చి.. తల్లి కావాలని మారం చేస్తూ ఏడుస్తున్న చిన్నారికి అత్యంత భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. పసిపాపను చేతుల్లోకి తీసుకుని ఒక్కసారిగా కిందకు విసిరేసింది. అక్కడితో అగక తన కాలితో తన్నింది. దెబ్బలు తగిలి నొప్పితో పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా నరకాన్ని చూపింది. ఈ ఘటన నవీ ముంబాయ్‌లోని పూర్వా ప్లేస్కూల్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నవీ ముంబైలోని ఖర్ఘర్ సెక్టార్ 10లో నివాసముండే రజత్ సిన్హా, రుచితలు ఇద్దరు ఉద్యోగస్తులు. రజత్ ఇంజనీరు కాగా, రుచిత సాఫ్ వేర్ కంపెనీలో హెచ్ ఆర్ ప్రోఫెషనల్ గా వ్యవహరిస్తుంది. తన మెటర్నిటీ లీవ్ పూర్తి కావడంతో ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయంలో తమ 9 నెలల బిడ్డ రితిషాను అన్ని వివరాలు తెలుసుకుని, మిగతా పిల్లల తల్లిదండ్రులను విచారించిన తరువాత స్థానికంగా వుండే పూర్వ కేర్ సెంటర్ లో జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేయడానికి బలమైన కారణం సిసిటీవీ వుందని చెప్పడం కూడ అని బాలిక తండ్రి రజత్ సిన్హా తెలిపాడు.

ఈ నెల 21న తమ బిడ్డ రితిషాను డే కేర్ సెంటర్ లో దించామని, తమ బిడ్డ ఎలా వుందో అన్న అందోళనలో ప్రతి గంటకూ ఓ పర్యాయం తన భార్య రుచిత కేర్ సెంటర్ కు ఫోన్ చేసి వాకాబు చేసిందని, తమ అత్త కూడా బిడ్డ గురించి వాకాబు చేసిందని, అయితే బాగానే వుంది అడుకుంటుందన్న సమాధానాలతో సంతృప్తి చెందామని రజత్ తెలిపాడు. అయితే రాత్రి ఏడున్నర గంటలకు బిడ్డను ఇంటికి తీసుకువచ్చేందుకు కేర్ సెంటర్ కు వెళ్లగా తమ బిడ్డ కంటి కింద గాయమైనట్లు గురించి అడుగగా, తనే అడుకుంటూ కిందపడటం వల్ల గాయమైందని ఆయా చెప్పిందని అన్నాడు.

ఇంటికి వెళ్లిన తరువాత బిడ్డ బట్టలు మారుస్తుండగా, ఒళ్లంతా గాయాలున్నాయని, వాటి కారణంగా రితిషా తధేకంగా ఏడుస్తుందని తెలిసి.. మర్నాడు అస్పత్రికి తీసుకెళ్లగా, అవి గాయపడిన దెబ్బలు కావని, ఎవరో బలంగా కొట్టారని డాక్టర్ తెలిపాడన్నారు. తమ బిడ్డకు మరిన్ని గాయాలు కావడంతో సిటీ స్కాన్ తీయగా తల వెనుక బాగంలో చిన్న ఫ్రాక్చర్ కూడా అయ్యిందని, దానికి వైద్యులు రెండు రోజుల పాటు పర్యవేక్షణలో వుంచాలని చెప్పడంతో అస్పత్రిలో అడ్మిట్ చేశామన్నారు.

తమ బిడ్డపై జరిగిన దారుణం పట్ల డే కేర్ సెంటర్ కు వెళ్లి నిలదీసామని.. పోలీసులకు పిర్యాదు చేసిన తరవాత సిసిటీవీ ఫూటేజ్ ను పరిశీలించగా, తమ బిడ్డ పట్ల అక్కడ పనిచేస్తున్న అయా ఎంత దారుణంగా వ్యవహరించిందో చూసి హతాశుడనయ్యానని రజత్ సిన్హా తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్వా ప్లే స్కూల్ సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే పాపను కేర్ టేకర్ అఫ్సానాషేక్ కొడుతూ కనిపించింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి 14రోజుల రిమాండ్‌కు పంపించారు.
 
ఈ సెంటర్ ప్రారంభించి 5నెలలే అయ్యింది. అఫ్సానా ఉద్యోగంలో చేరి నెలే అయ్యింది. చిన్నపిల్లలందరినీ అఫ్సానా కొట్టి పడుకోపెడుతోందని పోలీసులు గుర్తించారు. అమెతో పాటు డే కేర్ సెంటర్ నిర్వాహకురాలిని కూడా అరెస్టు చేయగా, నిర్వాహకురాలు బెయిల్ ఫై విడుదలైందని, అయా అఫ్సానా మాత్రం ఇంకా రిమాండ్ లోనే వుందని పోలీసులు తెలిపారు. దీంతో డే కేర్ సెంటర్లలో నిర్వాహకులతో పాటు అందులో పనిచేసే సిబ్బంది ఎవరన్నది కూడా విచారించాల్సిన అవసరముందని ఈ ఘటన తెలియజేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Navi Mumbai  day care centre  maid assaults child  Purva Nursery  CCTV footage  

Other Articles