హద్దు ధాటితే సరసం విరసమే..Russian classroom prank turns violent

Classroom prank turns into fight when a boy viciously attacks a girl

Classroom prank, Classroom prank turns violent, Classroom prank, prank, prank truns violent, student, violent, Irkutsk Oblast, russia, boy viciously attacks girl, teenagers messing in classroom, students violent attack, joking becomes violenr, Maria P, classmate

A group of teenagers messing around in the classroom shockingly turned into a violent attack on a school girl in russia

సరదా గీత దాటితే.. సహనం నశిస్తే.. ఇంతేనేమో..!

Posted: 11/25/2016 08:03 PM IST
Classroom prank turns into fight when a boy viciously attacks a girl

అభిమానం కానీ, అప్యాయత కానీ హద్దుల్లో వుంటేనే ముద్దు.. హద్దు దాటితే అంతే సంగతులు అని మన పెద్దలు చెబుతుంటారు. సరదా పట్టించాలన్న.. ఎవరినైనా అట పట్టించినా కొద్ది సేపటి వరకు ముద్దు. వారు సహనం కోల్పోతే మాత్రం ఇక రచ్చ రచ్చే. ఈ విషయాన్ని ఆ తరగతి గదిలోని తోటి విద్యార్థిని అటపట్టించిన మేరి అనే విద్యార్థినికి అలస్యంగా తెలిసవచ్చింది. క్లాస్ రూమ్ లో సరదా శృతిమించడంతో అమ్మాయన్న విఛక్షణ కూడా లేకుండా అమెపై పిడిగుద్దులు కురిపించాడు యువకుడు.

అగ్నేయ రష్యాలోని ఇర్కుటస్క్ ఓబ్లాస్ట్ ప్రాంతంలని ఇర్కుటస్క్ పట్టణంలోని ఓ పాఠశాలలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ అమ్మాయికి ఎదురైన చేదు అనుభవం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూలు బ్రేక్ సమయంలో మారియా అనే 15 ఏళ్ల అమ్మాయి తన స్నేహితుడిని ఏడిపించాలని అనుకుంది. అందుకోసం ఆమె ఓ గ్లాసుడు నీళ్లు తీసుకుని అతగాడి మీద పోసింది. ఆర్టెమ్ అనే ఆ కుర్రాడికి ఆ ఘటనతో ఎక్కడలేని కోపం వచ్చింది.
 
ఒక్కసారిగా ఆమెను అవతలకు తోసి.. తలమీద, ముఖం మీద పిడికిలితో ముష్టిఘాతాలు మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు.. మిగిలిన పిల్లలు పట్టుకుని ఆపేవరకు ఏకంగా పది గుద్దులు గుద్దాడు. వాళ్లంతా పట్టుకున్నా కూడా ఒకటి రెండుసార్లు కొట్టబోయాడు. అంత కోపం వచ్చింది మరా పిల్లాడికి. సరదాకు చేసిన పని కాస్తా ఇలా విరసంగా మారడంతో పాపం ఆ అమ్మాయి నేలమీద కూర్చుని రెండు చేతుల్లో తల దాచుకుని ఏడ్చింది. ఈ దాడి మొత్తాన్ని ఓ విద్యార్థి తన స్మార్ట్‌ఫోన్‌లో షూట్ చేశాడు. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అది వైరల్‌గా మారింది.
 
అయితే అప్పడప్పుడే యుక్తవయస్సులోకి వస్తున్న వారు కావడంతో వారిలోనూ ప్రతీకార జ్వాల కట్టలు తెంచుకుంది. అక్కడితో ముగిస్తుందనికున్న ప్రతికార కథ రెండో ఎపిసోడ్ వరకు లాక్కెళ్లింది. మారియా స్నేహితులు ఐదుగురు కలిసి స్కూలు అయిపోయిన తర్వాత ఆ కుర్రాడిని కుమ్మేశారు. స్కూలు వెనకాల అతడిని పట్టుకుని, గ్రౌండులోకి తీసుకెళ్లి చితక్కొట్టారు. స్కూలు సెక్యూరిటీ గార్డు చూసి వాళ్లను ఆపాడు. అయితే, చివరకు వివరం అడిగి తెలుసుకన్న గార్డు కూడా అతగాడు చేసిన పనికి ఈమాత్రం పడాల్సిందేనని అనడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Classroom prank  prank  prank truns violent  student  violent  Irkutsk Oblast  russia  

Other Articles