పెద్ద నోట్ల రద్దు వెనుక రహస్యాన్ని చెప్పిన జైట్లీ arun Jaitley opens up secret beyond currency ban

Arun jaitley opens up secret beyond currency ban

Currency ban, Notes Ban, Arun jaitley, Parliament, digital transactions, Cashless Society, demonetisation, parliament session, congress, rbi rules, pm modi demonetisation, demonetisation rules, atm withdrawal charges, atm withdrawal limits, india news

Finance Minister Arun Jaitley said the government wanted the physical currency to come down and be substituted by digital currency.

పెద్ద నోట్ల రద్దు వెనుక రహస్యాన్ని చెప్పిన జైట్లీ

Posted: 11/25/2016 08:49 PM IST
Arun jaitley opens up secret beyond currency ban

అవినీతిపై అలుపెరుగని పోరాటంలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక వున్న మరో సీక్రెట్ ను కేంద్ర అర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ పార్లమెంటులో రివీల్ చేశారు. కరెన్సీ నోట్ల వినియోగాన్ని తగ్గించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. కరెన్సీ నోట్లకు బదులుగా డిజిటల్ ధనాన్ని ఉపయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ చెల్లింపుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జైట్లీ ఈ వివరణ ఇచ్చారు.

భౌతిక కరెన్సీ తగ్గాలని, అదే సమయంలో వ్యాపార, వాణిజ్యాలు అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం 80 కోట్ల డెబిట్ కార్డులు ప్రజల వద్ద ఉన్నాయని, వాటిలో 40 లక్షల కార్డులు చురుగ్గా ఉపయోగంలో ఉన్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ వాలెట్లను, నిదులను డిజిటల్‌ పద్ధతిలో బదిలీ చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములుకావాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు పేర్కొన్నారు.

నగదు రహిత సమాజం లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారం కోసం నిధులను కేటాయించినట్లు తెలిపారు. నగదు రహిత సమాజం వల్ల నగదు నిర్వహణ కోసం మదుపు తగ్గుతుందని, చెల్లింపుల్లో పారదర్శకత వస్తుందని, నకిలీ కరెన్సీని అడ్డుకోవచ్చునని వివరించారు. ప్రజా జీవితం నుంచి నల్లధనాన్ని, అవినీతిని తొలగించేందుకు ప్రభుత్వం-ప్రజల మధ్య లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో జరిగేవిధంగా చూసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles