నో క్యాష్.. బ్యాంకులు బంద్... ఇక చుక్కలేనా? | No cash in Banks, banks two days holidays.

Two days holidays for bank

Bank Holidays, Bank Bandh, No Cash in Banks, No Cash Board, ATM no money, Bank Closed

Two Days Holidays for banks, No Money even in ATM also.

ఈ రెండు రోజులు ఇక చుక్కలే...

Posted: 11/26/2016 08:07 AM IST
Two days holidays for bank

కరెన్సీ కోసం క్యూలు కడుతున్న ప్రజలకు మరింత ఇబ్బందికరమైన వార్త. శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు దినాలు కావటంతో ఈ రెండు రోజులు ప్రజలకు చుక్కలు కనిపించనున్నాయి. గత వారం రోజులుగా చాలినన్నీ నోట్లు లేక ఏటీఏం లు మూతపడగా, శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే... ఇప్పటిదాకా ఏటీఎంలకు నో క్యాష్ బోర్డు తగలించగా, ఇప్పుడు ఆ పరిస్థితి బ్యాంకులు కూడా దాపురించింది. బుధ, గురువారాల్లో రోజువారీ లావాదేవీలు కూడా జ‌ర‌ప‌లేని స్థితికి బ్యాంకులు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు రిజ‌ర్వు బ్యాంకు పంపిన రూ.2 వేల నోట్లు మార్పిడి కోస‌మే స‌రిపోయాయి. బ్యాంకుల ద‌గ్గ‌ర ఉన్న‌, డిపాజిట్ల ద్వారా వ‌చ్చిన చిన్న నోట్ల‌ను ఏటీఎంల‌లో స‌ర్దేశారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన కొత్త నోట్లు వారి చేతుల్లోనే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల సెలవుతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేవారికి, చిరు వ్యాపారస్థులలో ఆందోళన నెలకొంది.

అయితే కొత్త 500 నోట్లు రావటంతోపాటు శనివారం మధ్యాహ్నం కల్లా మరి కొంత సొమ్మును పంపించి ఏటీఎంల ద్వారా సర్దుబాటు చేస్తామని ఆర్బీఐ చెబుతోంది. మరోవైపు సోమవారం భారత్ బంద్ కు ప్రతిపక్షాలు పిలుపు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో రోజు కూడా బ్యాంకు కార్యకలాపాలు స్థంభించిపోతే మాత్రం ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఆ కాల్స్  నమ్మొద్దు:

ఇప్పటికే నోట్ల సమస్యతో బాధపడుతున్న ప్రజలకు మరో షాక్. సడన్ గా మీ ఫోన్ రింగ్ అవుతుంది. మీ ఆకౌంట్ నంబర్ మారుతుందని లేదా మీ పిన్ నంబర్ మార్చుకోవాలంటూ అంటూ అవతలి నుంచి ఓ వ్యక్తి వార్నింగ్ ఇస్తాడు. అంతేనా మీ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, ఆఖరికి పర్సనల్ పిన్ నంబర్లు చెప్పాలంటూ ఆరాలు తీస్తాడు. అయితే అవన్నీ ఫేక్స్ కాల్స్ అని చెబుతున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. తొందరపడి ఎలాంటి సమాచారం అందించొద్దని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banks  Holidays  No Cash Boards  

Other Articles