అమెరికా పక్కలో బల్లెం.. అతిపెద్ద ఫెయిల్యూర్.. ఫెడరల్ కాస్ట్రో | special story on Fidel Castro.

Special story on fidel castro life

Fidel Castro, Fidel Castro life, fidel castro che guevara, che guevara about Castro, Castro che guevara, Fidel Castro rare moments, Fidel Castro rare photos, Fidel Castro life, Fidel Castro America, Fidel Castro Cuba, Fidel Castro news, Fidel Castro cremations, Fidel Castro mourning days

Special Story on Fidel Castro, Cuba's leader of revolution.

స్పెషల్: సామ్రాజ్యవాదానికి పక్కలో బల్లెం

Posted: 11/26/2016 05:10 PM IST
Special story on fidel castro life

ఫెడెల్ కాస్ట్రో.. ఇది ఒక పేరు కాదు.. విరుచుకుపడే ఉద్యమ కెరటం. నియంతృత్వ బానిస సంకెళ్లను తెంచి కన్నభూమి క్యూబాకు ఎర్ర తిలకం దిద్ది అర్థ శతాబ్దం పాటు నడిపిన మహానేత. క్యూబా నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడ్డారు.... అకుంఠిత దీక్ష, పట్టుదలతో ప్రాణాలకు తెగించి పోరాడారు.. కోట్లాదిమంది ప్రజల ఆదరణ పొందాడు.. ఓ చేత్తో దేశాన్ని పాలిస్తూనే, సంచలన నిర్ణయాలతో అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించారు. ఇప్పటికీ ఆ దేశ ప్రజలు మీ హీరో ఎవరంటే క్యాస్ట్రో పేరే చెబుతుంటారు. నియంత పాలన నుంచి దేశాన్ని ఎలా విడిపించుకోవాలో అ తర్వాత కొన్ని దేశాలు క్యాస్ట్రో పోరాటాలను రిఫరెన్సులుగా తీసుకున్నాయి.

పుట్టుక..
మయారి పట్టణానికి సమీపంలోని ఉన్న బిరాన్ గ్రామంలో జన్మించారు.. క్యాస్ట్రో తండ్రి స్పెయిన్ దేశం నుంచి వలస వచ్చిన చెరకు తోటల పెంపకం దారుడు. కాస్ట్రో తల్లి లీనా రుజ్ గొంజాలెజ్ పనిమనిషిగా చేసేవారు. చిన్నతనంనుంచి క్యాస్ట్రో చురుగ్గాఉండేవారు.. ఉద్యమాల్లో పాల్గొనేవారు.. 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలోచేరిన ఫిడేల్‌ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.. 1950లో హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.(విప్లవ జ్యోతి ఆరింది)

ఉద్యమ ఓనమాలు...
న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే 1952లో క్యూబా ప్రతినిథుల సభ కోసం జరగబోయే ఎన్నికల్లో పోటీచేశారు. అయితే అదే సమయంలో బాటిస్టా.... మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొల్పాడు. కాస్ట్రో.... బాటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించారు. అలుపెరగని పోరాటంతో క్యూబాను పశ్చిమార్థ భూగోళంలో మొట్ట మొదటి సామ్యవాద దేశంగా మార్చారు.

Castro life

జూలై 26, 1953 న కాస్ట్రో దళాలు క్యూబాలోని మోన్‌కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించాయి. ఈ ముట్టడిలో పట్టుబడిన క్యాస్ట్రోకు 15ఏళ్ల జైలుశిక్ష విధించారు.. 1955లో బాటిస్టా ఫిడేల్‌ను విడుదల చేశాడు. జైలునుంచి బయటకువచ్చిన కాస్ట్రో జూలై 26 ఉద్యమం అనే పేరుతో విప్లవ దళాన్ని నిర్మించారు... ఈ విప్లవ దళంతో కాస్ట్రో మెక్సికో వెళ్లారు... అక్కడే విప్లవ కారుడు చెగువీరా వీరితో కలిసారు. మొత్తం 82 మందితో కూడిన ఈ విప్లవ దళం 1956 డిసెంబరులో క్యూబాలో కాలు పెట్టింది.. ఈ దళంలోని 70 మంది పోరాటంలో అమరులయ్యారు.. కాస్ట్రో, అతని సోదరుడు రౌల్ కాస్ట్రో, చెగువీరా మరో 12 మంది క్యూబా ఆగ్నేయ ప్రాంతంలోని సియెర్రా మేస్త్రా పర్వత శ్రేణిలోకి పారిపోయారు. అక్కడి ప్రజలను విప్లవదళంలోకి చేర్చుకున్నారు.. దళాన్ని అనూహ్యంగా పెంచుకున్న క్యాస్ట్రో 1958 డిసెంబరులో హవానాకు బయలుదేరాడు. ప్రజలనుంచి క్యాస్ట్రోకు లభించిన ఆదరణచూసిన బాటిస్టా జనవరి 1, 1959 న దేశం విడిచి పారిపోయాడు.. ఆ తర్వాత క్యూబా నాయకుడిగా కాస్ట్రో అధికారాన్ని చేపట్టారు.

Fidel Castro life

అమెరికా అతిపెద్ద ఫెయిల్యూర్...

అధికారాన్ని చేపట్టిన వెంటనే కాస్ట్రో అమెరికాతోసహా విదేశీయులతోపాటు.. పలువురు స్వదేశీయుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు... ఈ చర్యలతో అమెరికాతో దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి.. అప్పు, ఆయుధాలు, ఆహార సరఫరా అవసరాలకోసం క్యాస్ట్రో సోవియట్ యూనియన్‌కు దగ్గరయ్యారు.. క్యూబా సహజ వనరులన్నింటినీ జాతీయం చేశారు.... వ్యవసాయాన్ని సమష్టిగా నిర్వహించారు... క్యూబాలో ఏక పార్టీ పాలనతో సోషలిష్టు రాజ్యాన్ని నెలకొల్పారు.. ఈ నిర్ణయాలతో ధనవంతులైన క్యూబన్లు దేశం విడిచి వెళ్ళిపోయారు. కాస్ట్రో క్యూబాలోని అమెరికా కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకోవటంతో యూఎస్‌ ఆగ్రహించింది.. 1960లో క్యూబాతో అన్ని రకాల వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకుంది.

అమెరికాకు పూర్తివ్యతిరేకంగాఉన్న ఈ విప్లవవీరున్ని హత్య చేసేందుకు యూఎస్‌కు చెందిన గూఢాచార సంస్థ సీఐఏ 600 పై చిలుకు ప్రయత్నాలే(638సార్లు) చేసి పరువుపొగొట్టుకుంది. క్యాస్ట్రో కాల్చే చుట్టలో బాంబు పెట్టి, అతని స్కూబా-డైవింగ్ సూట్‌లో ప్రాణాంతకమైన ఫంగస్‌ను ప్రయోగించి చంపేందుకు ట్రై చేసింది. మాఫియా తరహాలోకూడా కాస్ట్రోను కాల్చివేయటానికి చూసింది. ఈ కుట్రలనుంచి తప్పించుకున్న కాస్ట్రో మృత్యుంజయుడై బయటపడ్డారు.

Castro murder attempts

ఓసారి తన ప్రియురాలు మారిటాను ట్రాపులో పడేసిన సీఐఏ కాస్ట్రోను అంతం చేసే బాధ్యత అప్పగించింది. ఓ కోల్డ్ క్రీమ్ సీసాలో కొన్ని విషపు టాబ్లెట్స్ రహస్యంగా తెప్పించుకుని, వాటిని ఎలాగోలా ఎందులోనో కలిపేసి కాస్ట్రోతో తాగించాలి. కానీ, కాస్ట్రో పసిగట్టేశాడు. అంతే ఆమె నరాలు చల్లబడ్డాయి. ఆమె చేతికే గన్ను ఇచ్చి, ఆమె కళ్లల్లోకి చూస్తూ ‘‘నన్ను చంపెయ్’’ అన్నాడు. ‘నో, నో.. నేను చంపలేను’ అంటూ ఆమె కుప్పకూలిపోయింది. కాస్ట్రో జీవితంలో యాక్షన్ సినిమాల తరహా ఘటనలు ఎన్నో.

ఎనిమిది మంది అమెరికా అధ్యక్షులు ఏమీ చేయలేకపోయిన మొండి ఘటం కాస్ట్రో. చివరకు తను 90 ఏళ్ల వయసులో ‘అపర భీష్ముడిలా’ తనంతట తాను మరణించాడే తప్ప ఏ రాజకీయ కుట్ర కూడా తనను బలి తీసుకోలేకపోయింది.

సామ్యవాదం వైపు...
1961లో క్యూబా నుండి ప్రవాసం వచ్చిన వారి ద్వారా కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికా ప్రయత్నించింది.. ఈ ఘటన తరువాత కాస్ట్రో మరింతగా సామ్యవాదం వైపు దృష్టిపెట్టాడు... సోవియట్ యూనియన్ తో బలమైన బంధాలను ఏర్పాటుచేసుకున్నాడు.. యూనియన్‌నుంచి ఆర్థిక, సైనిక పరమైన సహాయాలను పొందారు.. వర్ధమాన దేశాలలో అలీనోద్యమ నేతగా క్యాస్ట్రో ఎదిగాడు.. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో విప్లవోద్యమాలకు సహాయం చేశారు... కాస్ట్రో ప్రభుత్వం క్యూబన్లకు మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలను కల్పించింది.. 1991లో సోవియట్ యూనియన్ పతనమవటంతో ఆ దేశం నుండి నిరవధికంగా అందుతున్న సహాయం ఆగిపోయింది. అయినా కూడా కాస్ట్రో సామ్యవాద పంథాకే బలంగా కట్టుబడ్డాడు.

Fidel Castro style


ఆలివ్‌ గ్రీన్‌ యూనిఫాం, నోట్లో సిగార్ ఇది కాస్ట్రో స్టైల్. అమెరికా సామ్రాజ్యవాదంపై నిప్పులు చెరిగే ప్రసంగాలూ, ఆత్మగౌరవం తొణకిసలాడే ప్రకటనలూ మిగతా దేశాలకు దిక్సూచిగా మారాయి.

సమకాలీన ప్రపంచంలోనే సమున్నత నాయకుడు సాటిలేని పాలకుడు పోరాట యోధుడు, ఆరితేరిన అనుభవజ్ఞుడు కాస్ట్రో. కాస్ట్రోను తల్చుకోగానే గుర్తుకు వచ్చే మరో పేరు ‘చే గువేరా’. మొదటిసారి మెక్సికోలో కలుసుకున్న వీరిద్దరూ ఆపై క్యూబా పోరాటంలో కలిసి ముందుకు సాగారు. కాస్ట్రో అదికారం వైపు వెళ్లాక చెగువేరా భూసంస్కరణలు, అక్షరాస్యతపై దృష్టి మళ్లించాడు. చిన్న చిన్న పొరపచ్చాలతో విడిపోయే సమయంలో కూడా ఇక తన ఆఖరి లేఖలో కాస్ట్రో నాయకత్వ పటిమను గొప్పగా అభినందించాడంటే అర్థం చేసుకోవచ్చు.

castro chuguvera

క్యూబాలో విప్లవోధ్యమాన్ని రగిలించి పశ్చిమార్దదేశాల్లో తొలి సామ్యవాద దేశంగా తన దేశాన్ని తీర్చి దిద్దారు. తరువాత అమెరికాకు నిద్రలేకుండా చేశారు. అలీనోద్యమంలో మనతో పాటు అగ్రస్థానం వహించిన ఆ దేశం మన పాలకులు అగ్ర రాజ్యం లోబడినా తను మాత్రం తలవంచడానికి నిరాకరించాడు. వెనిజులా అద్యక్షుడు హ్యూగో చావేజ్‌తో సహా లాటిన్‌ అమెరికాలోనూ ప్రగతిశీల ప్రత్యామ్నాయానికి అండనిచ్చింది. తన చివరి ప్రసంగంలో (క్యూబా కమ్యూనిస్టుపార్టీ మహాసభలో) ‘‘నేను త్వరలోనే రాలిపోవచ్చని కానీ, కమ్యూనిజం ఆశయాలు మాత్రం ఉజ్వలంగా ప్రకాశిస్తుంటాయని పేర్కొన్నాడు.

Fidel Castro rare moments

ఈ పోరాట వీరుడి మరణం తీరని లోటంటూ సొంత ప్రజలే కాదు.. స్వాతంత్ర సామ్యవాద భావాజాలాలున్న ప్రతీ ఒక్కరినీ కలిచివేస్తుంది. నిజంగానే మనకు దూరమైనా చెరిగిపోని ఉత్తేజమై వెలుగుతూనే ఉంటాడు.


ఓ యోధుడా, ఓ నాయకుడా, ఇక సెలవు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cuba's leader  Fidel Castro  Special Story  

Other Articles