ఓట్ల కోసం టోపీ పెట్టుకుని ఓవరాక్షన్.. ఎవరిని ఉద్దేశించి అన్నాడు | comedian Ali comments on politicians.

Comedian ali comments on politics

comedian Ali, Jago Muslims... Chalo Guntur, Ali on politics, Ali in janasena, Comedian Ali Political Career

Tollywood Comedian Ali fire on Politicians in Jago Muslims.. Chalo Guntur.

రాజకీయాలపై అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 11/28/2016 09:27 AM IST
Comedian ali comments on politics

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజ‌కీయ నాయ‌కులు తాము టోపీలు పెట్టుకోవ‌డ‌మే కాకుండా ముస్లింల‌కు కూడా టోపీలు పెడుతున్నార‌ంటూ విమర్శించాడు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్ష‌న్ ప్లాజాలో నిర్వ‌హించిన 'జాగో ముస్లిం.. చ‌లో గుంటూరు' పేరుతో నిర్వ‌హించిన ముస్లింల ఆత్మీయ స‌మ్మేళ‌నానికి అలీ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించాడు.

ఈ సందర్భంగా అలీ మతాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారంటూ ఆక్రోశించాడు. ముస్లింల ప‌ర్వ‌దిన‌మైన రంజాన్ రోజునే రాజ‌కీయ నాయ‌కుల‌కు ముస్లింలు గుర్తొస్తార‌ని విమ‌ర్శించారు. ఆరోజు వారు త‌ల‌పై టోపీలు పెట్టుకోవ‌డ‌మే కాకుండా ముస్లింల నెత్తిపైనా టోపీలు పెడుతున్నార‌ని అన్నారు. చ‌దువుతోనే ప్ర‌గ‌తి సాధ్య‌మ‌ని, బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడులు మంచివి కావని సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముస్లింల‌కు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే ముస్లింలు ఓటేయాల‌ని పిలుపునిచ్చాడు.

కాగా, 2014 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి అలీ పోటీ చేస్తాడని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. ఆ మధ్య పవన్ జనసేన కి అవసరమైతే సేవలు అందిస్తానని పరోక్షంగా వ్యాఖ్యలు చేయటంతో ఆలీ జనసేనలో జాయిన్ అవుతారనే టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్, అలీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. దీంతో అలీ జనసేనలో చేరే అవకాశంను తోసిపుచ్చలేం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Top Comedian  Ali  Politics  Jago Muslims... Chalo Guntur  

Other Articles