సర్జికల్ స్ట్రైక్స్ బదులుగా టెర్రర్ స్ట్రైక్స్... | Nagrota terror attack shows poor security at camps.

7 killed in terror strikes army camp at nagrota

Nagrota terror attack, Intelligence warn, poor security at camps, Nagrota terror latest, Nagrota terror news, Nagrota terror mistake, Nagrota terror Pakistan, Nagrota terror Modi

Nagrota terror attack: Intelligence warned of imminent attack, spotlight now on poor security at camps.

పఠాన్ కోట్, యూరీ కన్నా భయంకరమైన దాడి?

Posted: 11/30/2016 08:06 AM IST
7 killed in terror strikes army camp at nagrota

రెండు నెలల క్రితం యూరీ దాడికి ప్రతీకారంగా భారత్ మెరుపు వేగంతో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన ఉగ్రవాదులను, వారికి సాయంగా నిలిచిన పాక్ సైనికులను మట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి విరామం లేకుండా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దులో తుటా పేలని రోజు లేదంటే అతిశయోక్తికాదు.

అయితే సర్జికల్ స్ట్రయిక్స్ కు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన పాకిస్థాన్ ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మంగళవారం జమ్ములోని నగ్రోటాలోని ఆర్మీ క్వార్టర్స్ వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలసిందే. ఎమ్ఈఎస్ (మిలటరీ ఇంజనీర్స్ సర్వీసెస్) భవనంలోకి సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు పోలీస్ యూనిఫాంలో ప్రవేశించి, తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. మొత్తం అక్కడున్న ఏడుగుర్ని హత్య చేశారు. ఇందులో ఇద్దరు ఆర్మీ అధికారులు కూడా ఉన్నారు.

అనంతరం అక్కడున్న 16 మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ 16 మందిలో 12 మంది ఆర్మీ జవాన్లు కాగా, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారులు కావడం విశేషం. దీంతో ఆ ప్రాంతాన్ని సైనికులు చుట్టుముట్టి మరీ ముగ్గురిని హతమార్చింది. ఇక మరో ఘటనలో చమ్లియాల్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మట్టికరవగా, ఓ డీఐజీ రేంజ్ ఆఫీసర్ తోసహా పలువురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు.

కాగా, వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ  సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేవలం పాకిస్థాన్ బార్డర్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రోటాపై దాడులకు తెగబడ్డారంటే ఇంటలిజెన్స్ హెచ్చరించినా భద్రతా వైఫల్యం కొట్టోచ్చినట్లు కనిపిస్తోందని మాజీ ఆర్మీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సైనికులు అప్పుడు కూడా అప్రమత్తం అయి ఉండకపోతే ప్రాణ నష్టం భారీగా ఉండేదని అంటున్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి అనంతరం చోటుచేసుకున్న యురీ సెక్టార్ దాడి తీవ్రమైనది కాగా, ప్రస్తుతం చోటుచేసుకున్న దాడి మరింత తీవ్రమైనది వారు వ్యాఖ్యానించటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagrota terror  PM Modi  Intelligence warn  poor security  

Other Articles