కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజాఉద్యమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఇవాళ అమె టాక్ అఫ్ ది పార్లమెంటుగా మారారు. విషయంలోకి వస్తే.. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రజా అందోళన కార్యాక్రమాలకు పిలుపునివ్వడం.. ఇందులో భాగంగా అమె బీహార్ కు వెళ్లి అక్కడ కూడా డీమానిసటేషన్ కు వ్యతిరేకంగా సభలో మాట్లాడి రావడం అంతా తెలిసిందే.
ఈ తరుణంలో అమె పశ్చివ బెంగాల్ కు తిరిగివస్తున్న క్రమంలో అమె ప్రయాణిస్తున్న ఇండిగో విమానం కోల్‌కతా విమానాశ్రయం వద్ద దాదాపు అరగంట పాటు ల్యాండింగ్ కాకుండా గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇంధనం అయిపోతుందని పైలట్ ఏటీసీ అధికారులకు చెప్పినా.. విమానాన్ని దించేందుకు ఏటీసీ అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో సుమారు అరగంట తరువాత విమానాన్ని కిందకు దించారు. దీంతో మమత బెనర్జీని హత్య చేయడానికే కుట్ర జరిగిందని ఆ పార్టీకి చెందిన మంత్రి ఫిర్హాద్ హమీక్ అరోపించారు.
ఇదే అంశంపై అటు అటు పార్లమెంటులోనూ ప్రతిధ్వనించింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే అమె ప్రాణాలకు ముప్పు పోంచివుందని అందోళన వ్యక్తం చేశారు. తృణముల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తమ అధినేత్రికి జరిగిన విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చిన క్రమంలో వారు ఖార్గే స్పందిస్తూ మమతకు విమానంలో ఎదురైన పరిస్థితి సహేతుకరమైనది కాదని అన్నారు. కోల్‌కతా విమానాశ్రయంలో జరిగినది ఏమాత్రం సరికాదని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు.
దీనికి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లో్క్‌సభలో సమాధానం ఇచ్చారు. కోల్‌కతా విమానాశ్రయంలో అదే సమయానికి మొత్తం మూడు విమానాలు ల్యాండింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయని, మూడు విమానాల పైలట్లు కూడా దిగేందుకు అనుమతి కోరారని.. అయితే వాళ్లలో ఏ ఒక్కరూ ప్రయారిటీ ల్యాండింగ్ కావాలని మాత్రం అడగలేదని ఆయన చెప్పారు. కాగా, అసలు విమానాలు టేకాఫ్ తీసుకోడానికి ముందు అందులో తగినంత ఇంధనం ఉందా లేదా అనే విషయంపై డీజీసీఏ విచారణకు ఆదేశించామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more