కామ్రేడ్ లతో కళ్యాణ్పొ.. త్తు గురించి ఏం అన్నాడు? | Ramakrishna about meeting with Pawan Kalyan.

Cpi gives clarity on meeting with pawan kalyan

Janasena Pawan Kalyan, Janasena CPI, Pawan Kalyan Rama Krishna, Pawan CPI, Janasena CPI Rama Krishna, Pawan CPI Narayana, Pawan Kalyan 2016, Pawan Kalyan supports Comrades, Pawan kalyan AP CPI

CPI Leader Rama Krishna Meet Pawan Kalyan and asked for Janasena support their protests.

జనసేన-కామ్రేడ్ ల పొత్తు... ఓ క్లారిటీ

Posted: 12/03/2016 07:55 AM IST
Cpi gives clarity on meeting with pawan kalyan

వచ్చే ఎన్నికల్లో సీపీఐ జనసేన వెంట కలిసి నడవడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేత, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ స్పష్టమైన ప్రకటన చేశాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తుల గురించి చర్చించలేదని విజయవాడలో మీడియా సమావేశంలో తెలిపాడు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప్రజా సమస్యలపై కలిసి పోరాడడంపై గురించి మాత్రమే తాము చర్చించామని క్లారిటీ ఇచ్చేశాడు.

ప్రజా సమస్యల పరిష్కారానికి వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంతో కలిసి జనసేన పోరాడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గురువారం జనసేన కార్యాలయంలో సుమారు గంటన్నరపాటు పవన్, రామకృష్ణ భేటీ అయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా చర్చించామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, అధికారంలోకి రాగానే స్వరం మార్చడంపై చర్చించామని చెప్పాడు.

ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పేరుతో ఎకరాలకు ఎకరాలు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడంపై కూడా మాట్లాడామన్నాడు. వివిధ ప్రాజెక్టుల పేరుతో అవసరానికి మించినన్ని భూములు తీసుకుంటున్నారన్న తమ అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ కూడా ఏకీభవించారని తెలిపాడు. భవిష్యత్ లో ప్రజా సమస్యలపై పోరాటంలో తమతో చేతులు కలిపేందుకు జనసేన ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. స్వతహాగా ఎరుపు భావజాలాలు ఉన్న పవన్ ఇప్పటికైతే పోరాటంలో మాత్రమే పాలు పంచుకుంటున్నప్పటికీ, భవిష్యత్తులో పొత్తుగా ముందుకు వెళ్లే అంశాన్ని తోసిపుచ్చలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  CPI  Rama Krishna  

Other Articles